iphone Battery Life Tips: మీ ఐఫోన్‌ ఛార్జింగ్‌ ఇట్టే అయిపోతోందా?.. అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి!

www.mannamweb.com


How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్‌లో కూడా ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్‌ కంపెనీ కొన్ని టిప్స్‌ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఐఫోన్‌లో ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉండేందుకు మొదటగా చేయాల్సింది ‘ఐఓఎస్‌ అప్‌డేట్‌’ అని యాపిల్ తెలిపింది. కొత్త ఐఓఎస్‌ వెర్షన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం చాలా ముఖ్యం పేర్కొంది. ఈ అప్‌డేట్‌లు కొత్త ఫీచర్‌లను అందించడమే కాకుండా.. బ్యాటరీ లైఫ్‌ను, డివైజ్‌ సామర్థ్యాన్ని పెంచుతుందట. ఎప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వచ్చినా.. వెంటనే చేయాలని యాపిల్ చెబుతోంది.

ఐఫోన్‌లు 16- 22 ఉష్ణోగ్రతలోనే మెరుగ్గా పనిచేస్తాయని యాపిల్ తెలిపింది. ఒకవేళ ఐఫోన్‌కు 35 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ వేడి తగిలితే.. బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుందట. చల్లని వాతావరణంలో ఐఫోన్‌ను ఉంచినా.. బ్యాటరీ లైఫ్‌ తగ్గుతుందట. ఐఫోన్‌ సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఉంటే.. బ్యాటరీ లైఫ్‌ బాగుంటుందని కంపెనీ చెబుతోంది.

ఐఫోన్‌ రక్షణ కోసం దాదాపుగా అందరూ కేస్‌ లేదా పౌచ్‌లు వాడుతుంటారు. వాటితో పాటు ఛార్జింగ్‌ చేయడం మంచిది కాదని యాపిల్ అంటోంది. ఛార్జ్‌ చేసే సమయంలో ఐఫోన్‌ వేడెక్కుతుంది. కేసులు వేడిని బయటకు పోనీయకుండా చేయడంతో బ్యాటరీ దెబ్బతింటుంది. అందులకే ఫోన్‌ ఛార్జ్‌ సమయంలో పౌచ్‌ లేదా కేస్‌ల ఐఫోన్‌కు ఉంచరాదని కంపెనీ పేర్కొంది.

ఐఫోన్‌ను కొన్ని రోజులు వాడొద్దని అనుకున్న సమయంలో ఫుల్‌ ఛార్జి లేదా పూర్తిగా ఛార్జింగ్‌ లేకుండా పక్కన పెడుతుంటారు. అలా చేయడం వల్ల ఫోన్‌ పనితీరు మాత్రమే కాదు బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతాయట. ఫోన్‌ను కొన్ని రోజులు ఉపయోగించకుండా ఉంచాలనుకుంటే.. 50 శాతం ఛార్జింగ్‌ ఉంచడం మంచిదని యాపిల్‌ తెలిపింది. ఒక వేళ మీరు ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు అనుకుంటే.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఛార్జింగ్‌ చేయాలని చెప్పింది. లోపవర్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే బ్యాటరీ లైఫ్‌ బాగుంటుందట.