AP SSC 2024 Reverification Results: ఏపీ ‘పది’ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షల 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్లో స్కూల్స్ లాగిన్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మే 30 వరకు వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా ఈ సారి ఏపీలో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,966 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2024 రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

































