Bomb threat to Praja Bhavan: ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు.. నిందితుడు అరెస్ట్
Bomb threat to Praja Bhavan:తెలంగాణలో మంగళవారం ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. కొన్ని గంటల పాటు ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
చివరికి బాంబ్ లేదని తేల్చడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ కేసులో శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనే బాంబ్ ఉందంటూ ఫేక్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.