ఎక్కడికైనా పోస్ట్ పంపాలన్నా.. లేదా ఇతర వస్తువులు పంపడం, ఆర్డర్ చేయడం వంటివి చేయాలంటే ముందుగా పోస్టల్ పిన్ కోడ్ తప్పనిసరి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేస్తే ముందుగా కోడ్ అడుగుతుంది.
మనం ఉండే ప్రాంతరం పిన్ కోడ్ నంబర్ నమోదు చేస్తే అది ఏ ఏరియా అనేది తెలిసిపోతుంది. మరి ఈ ఆరు అంకెల పిన్ కోడ్‌ను ఎవరు సృష్టించారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ ఆరు అంకెల అర్థం ఏంటో తెలుసుకుందాం..భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రయాణంలో పిన్ కోడ్ సృష్టి ఒక మైలురాయి అనే చెప్పాలి. అదే పేరుతో గ్రామాలు, పట్టణాల నుండి ఉత్తరాలు పోస్టాఫీసుకు రావడం ప్రారంభించినప్పుడు పిన్ కోడ్ అవసరం అనిపించింది. అప్పుడు దేశం మొత్తాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించి పిన్ కోడ్‌లను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.
మన దేశంలో పోస్టల్ ఇండెక్స్ నంబర్ (Postal Index Number)ను పిన్ PIN లేదా పిన్‌కోడ్ Pincodeగా అని కూడా చెబుతుంటారు. అయితే మన దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది. భారతదేశంలో చాలా గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఉన్నాయి. భారతీయ పోస్టల్ సర్వీస్ కోసం సరైన వ్యక్తి లేదా స్థలాన్ని కనుగొనడం కొంచెం సవాలుగా ఉంటుంది. అందువల్ల, పార్శిల్‌లు లేదా లేఖలను డెలివరీ చేసే ప్రక్రియను మరింత ప్రభావవంతంగా చేయడానికి, ఇండియా పోస్ట్ ఆరు అంకెల పిన్ కోడ్ నంబర్‌ను రూపొందించింది.
స్వాతంత్ర్యానికి ముందు భారతదేశంలో పిన్ కోడ్ లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అనేక దశాబ్దాలుగా పిన్ కోడ్ రూపొందించలేదు. వాస్తవానికి, పిన్ కోడ్‌ను 1972 ఆగస్టు 15న అప్పటి కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీరామ్ భికాజీ ప్రవేశపెట్టారు. పోస్టాఫీసుకు వచ్చే లేఖలను మాన్యువల్‌గా క్రమబద్ధీకరించడం, పంపిణీ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి PIN కోడ్‌ల కొత్త వ్యవస్థ ముఖ్యమైనదిగా పరిగణించారు. ఎందుకంటే వివిధ భాషలు, గ్రామాల పేర్లు, చిరునామాలు పోస్టల్ ఉద్యోగిని చాలా గందరగోళానికి గురిచేశాయి. దీని పరిష్కారానికి ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడే ఒక ప్రామాణిక ప్రక్రియ అవసరం అని భావించారు. ఈ విధంగా, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలను గుర్తించడానికి పిన్ కోడ్‌లను ప్రవేశపెట్టారు.
భారతీయ పోస్టల్ సర్వీస్‌లో దేశంలో మొత్తం తొమ్మిది ప్రత్యేక పిన్ ప్రాంతాలుగా విభజించారు. వీటిలో ఎనిమిది భౌగోళిక ప్రాంతాలు కాగా, తొమ్మిదో ప్రాంతం భారత సైన్యానికి రిజర్వ్ చేయబడింది. PIN కోడ్‌లోని మొదటి అంకె ప్రాంతాన్ని సూచిస్తుంది, రెండవ అంకె సబ్‌జోన్, మూడవ అంకె ఆ ప్రాంతంలోని సార్టింగ్ జిల్లాను సూచిస్తుంది. అలాగే చివరి మూడు అంకెలు ఆ జిల్లాలోని నిర్దిష్ట పోస్టాఫీసును సూచిస్తాయి.
దేశం మొత్తం మీద 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి. కానీ ఈ పోస్టాఫీసులు 19,101 పిన్ కోడ్‌లుగా విభజించారు. ఈ పోస్టాఫీసులను ఐదు పోస్టాఫీసు జోన్‌లుగా విభజించారు. అవి ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పు, ఆర్మీ పోస్టల్ జోన్‌లు. నార్తర్న్ జోన్ కోడ్ 1,2, వెస్ట్రన్ జోన్ కోడ్ 3, 4, సదరన్ జోన్ కోడ్ 5, 6 , ఈస్ట్రన్ జోన్ కోడ్ 7, 8.
పిన్‌లోని మొదటి అంకె ఈ రాష్ట్రాలను సూచిస్తుంది:
1. చండీగఢ్, లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ.
2. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్.
3. దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్.
4. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర
5. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.
6. లక్షద్వీప్, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు.
7. సిక్కిం, అస్సాం, అండమాన్, నికోబార్ దీవులు, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ , ఒడిశా, పశ్చిమ బెంగాల్.
8. బీహార్, జార్ఖండ్.
9. ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్ (FPO), ఆర్మీ పోస్ట్ ఆఫీస్ (APO)
పిన్ కోడ్ మొదటి రెండు అంకెలు ఈ రాష్ట్రాలను సూచిస్తాయి?
11 ఢిల్లీ
12, 13 – హర్యానా
14-16 – పంజాబ్
17 -హిమాచల్ ప్రదేశ్
18, 19 – జమ్మూ కాశ్మీర్
20-28 – అరుణాచల్, ఉత్తర ప్రదేశ్
30-34 – రాజస్థాన్ 36-39 జిగారాట్
45-49 – మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్
50-53 – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
56-59 – కర్ణాటక
60-64 – తమిళనాడు
67-69 – కేరళ
70-74 – పశ్చిమ బెంగాల్
75-77 – ఒడిషా
78 -అసోం
79 -ఉత్తర-తూర్పు రాష్ట్రాలు
80-85 -జార్ఖండ్, బీహార్
90-99 – ఆర్మీ పోస్టల్ సర్వీస్
ఇక మీ ప్రాంతం పోస్టల్ పిన్ కోడ్ తెలుసుకోవాలంటే https://www.indiapost.gov.in/ని సందర్శించడం ద్వారా మీ పిన్ కోడ్‌ను పొందవచ్చు. దీనిపై మీరు మొత్తం సమాచారాన్ని నమోదు చేసి, చివరకు సబ్మిట్‌పై క్లిక్ చేస్తే తెలిసిపోతుంది.