రూ. 6 లక్షల్లోనే 7 సీటర్‌ కారు.. సూపర్‌ ఫీచర్స్‌

www.mannamweb.com


ప్రస్తుతం మార్కెట్లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే 7 సీటర్‌ కారు అనగానే ఎక్కువ బడ్జెట్‌ ఉంటుందనే విషయం తెలిసిందే.

పెద్ద కారు కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కు రూ. 8 లక్షలైనా పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ఓ 7 సీటర్‌ కారు అందుబాటులో ఉంది. ఇంతకీ ఏంటా కారు.? అందులోని ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రెంచ్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌ నుంచి వచ్చి 7 సీటర్‌ ట్రైబర్‌ కారుకు మంచి ఆదరణ లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ బేసిక్‌ వేరియంట్‌ ధర సుమారు రూ. 5.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక టాప్‌ ఎండ్ విషయానికొస్తే ఈ కారు ధర సుమారు రూ. 8.12 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌తో లభిస్తోంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ వేరియంట్‌తో ఈ కారును తీసుకొచ్చారు.

ఈ ఇంజన్‌ 96ఎన్‌ఎమ్‌ టార్క్‌, 72పీఎస్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ కారు లీటర్‌కు 18.9 నుంచి 19 కిలోమీటర్లు ఉంటుంది. 5 స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఇక ఈ కారులో 20.32 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లను అందించారు.

అలాగే ఇందులో ఎల్‌ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డ్, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, LED DRLలతో ప్రొజెక్టర్ హ్యాండ్‌ల్యాప్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ కూల్డ్ స్టోరేజ్, 182mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో అందించారు. ఇక భద్రత విషయానికొస్తే ఈ కారులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు (2 ముందు, 2 వైపు) ఉన్నాయి. గ్లోబల్ NCAP ఈ కారుకు పెద్దలకు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది.