అమరావతి: హౌసింగ్ కార్యక్రమంపై (Housing program) నిన్న (మంగళవారం) సమీక్షించానని (Review), గత ప్రభుత్వం (YCP Govt.) గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని మంత్రి కొలుసు పార్థ సారథి (Minister Kolusu Parthasarathy) విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ (TDP Govt.) హయంలో 2 లక్షలు నుంచి 2.50 వేలు వుంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 వేలకు తగ్గించారని ఆరోపించారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్యలో 4.43 లక్షలు ఇళ్లను పూర్తి చేయకుండా ఉంచేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను తాము పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
లే అవుట్‌లు గత ప్రభుత్వంలో నిర్మాణానికి అనుగుణంగా లేని ప్లేస్‌లో ఇచ్చారని, వెస్ట్ బెంగాల్‌లో 48.5 లక్షల ఇల్లు కట్టారని, నిధులు నిర్దేశించిన పనికి కాకుండా వేరే పనులకు వాడారని మంత్రి కొలుసు పార్థ సారథి ఆరోపించారు. ఇక్కడ కేంద్ర నిధులు దుర్వినియోగం అయినట్లు తేలిందన్నారు. లాండ్ తీసుకున్నప్పుడు నిర్మాణాలకు అనువుగా వుందా లేదా అన్నది చూడలేదని, డిపార్టుమెంట్‌లో ఏ అవకతవకలు జరిగినా విచారణ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రంలో హౌసింగ్ జరుగుతున్న తీరుపై కేంద్రం అసహనం వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జగనన్న కాలనీ పేరు మార్పుపై చర్చిస్తామని మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొన్నారు.