YS Jagan: బిగ్ బ్రేకింగ్.. జగన్ ఓదార్పు యాత్ర.. ఈ సారి ఎవరికోసమంటే.!

www.mannamweb.com


తాను ఇక జనంలోనే ఉండేలా ప్రయత్నిస్తానని వైసీపీ అధినేత జగన్ నేతలతో చెప్పారు. కిందిస్థాయి కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఎవరూ చూస్తూ ఊరుకోవద్దని, న్యాయపోరాటం చేసి క్యాడర్‌ను రక్షించుకుందామని ఆయన సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవిస్తూనే తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిద్దామని జగన్ వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతల విసృత స్థాయి భేటీలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని ఆయన పరామర్శించనున్నట్లు సమాచారం. అలానే.. వైసీపీ ఓటమి బాధతో చనిపోయినవారి కుటుంబాలనూ పరామర్శించి.. ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. డిసెంబర్‌ లేదా జనవరి నుంచి జగన్‌ ఓదార్పు ఉండే అవకాశం సమాచారం.

ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ… భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటివరకు తన ఆఫీసుకు వచ్చిన నేతలతో ఓటమిపై విశ్లేషణ చేసిన జగన్.. తాజాగా ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. ఆయా అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సెషన్స్‌లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

కాగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి పలువురు నేతలు హాజరకాలేకపోయారు. బెంగళూరు-విజయవాడ విమానం రద్దుతో హాజరుకాలేకపోతున్నట్లు పలువురు నేతలు పార్టీ ఆఫీస్‌కు సమాచారం ఇచ్చారు. ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వెంకటేగౌడ్, చెవిరెడ్డి భాస్కరెడ్డి, మోహిత్‌రెడ్డి, బుర్రా మధుసూదన్, విక్రమ్, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపిక, ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన రెడ్డప్ప వంటి నేతలు మీటింగ్‌కు హాజరకాలేకపోయారు.