APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

www.mannamweb.com


APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది.

పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రాల మార్పులు, జోన్ల ప్రధాన్యత మార్చుకునేందుకు ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 వరకు అవకాశం ఇస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని ఇకపై సవరణలకు అవకాశం ఉండదని వివరించింది.
ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. మెయిన్స్ కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ఉన్నాయి.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు రిజిస్టార్‌ చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను పొందారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.

ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జులై 28న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. మొత్తం 300 మార్కులకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.