Nara Lokesh: ఉపాధ్యాయులపై అనవసర పని భారం ఉండదు

www.mannamweb.com


Nara Lokesh: ఉపాధ్యాయులపై అనవసర పని భారం ఉండదు

అమరావతి: గత ప్రభుత్వంలో మాదిరిగా ఉపాధ్యాయులపై అనవసరమైన పని భారం, వేధింపులు ఉండవని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ సచివాలయంలోకి సోమవారం అడుగుపెట్టిన ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీ విధివిధానాలపై మొదటి సంతకం చేశారు.

అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల నుంచి లోకేశ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. సమస్యలపై పలువురు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మళ్లీ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు.