విజయవాడ: ఏపీ టెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీకి టెట్ అర్హత, 20శాతం వెయిటేజీ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా 2.35లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఈ ఫలితాల కోసం ఎదురు చూశారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ టెట్‌లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావొద్దని ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు. వీరంతా.. కొత్తగా బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు అతి త్వరలోనే నిర్వహించబోయే టెట్‌కు, మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని లోకేశ్ సూచించారు.

ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ టెట్‌లో 58.4శాతం ఉత్తీర్ణత నమోదు
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్‌కు 2,35,907 మంది (88.90%) రాశారు. రెండు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలో 1,37,904 మంది (58.4శాతం) మాత్రమే అర్హత సాధించినట్లు అదికారులు వెల్లడించారు. పేపర్ -1A (ఎస్జీటీ రెగ్యులర్)కు 1,13,296 మంది హాజరు కాగా.. 78,142 మంది (66.32శాతం) అర్హత సాధించారు. అలాగే, పేపర్ -1B (ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్)కు 1700 మంది దరఖాస్తు చేసుకోగా.. 790మంది (46.47శాతం) క్వాలిఫై అయ్యారు. పేపర్ 2A (ఎస్‌ఏ రెగ్యులర్)కు 1,19,500 మంది హాజరు కాగా.. వీరిలో 60,846 మంది (50.96శాతం) మాత్రమే క్వాలిఫై అయ్యారు. పేపర్ -2B (ఎస్‌ఏ స్పెషల్ ఎడ్యుకేషన్)కు 1,411 మంది హాజరు కాగా.. 1,125మంది (79.73శాతం) అర్హత సాధించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.