Ayushman Bharat: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకంలో అప్లై చేసుకుంటే మీకు రూ.5 లక్షల విలువైన వైద్యం మీ సొంతం..

www.mannamweb.com


కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి అతిపెద్ద వైద్య సంక్షేమ పథకం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సుమారు 10 కోట్ల కుటుంబాలు వైద్య సేవలను పొందనున్నారు. సుమారు యాభై కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం లభించనుంది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని 23 సెప్టెంబరు 2018న ప్రారంభించింది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా లబ్ధిదారులు ఆరోగ్య సేవలను పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దాదాపు 5 లక్షల రూపాయల విలువైన వైద్యం లభిస్తుంది. ఎంపిక చేసుకున్న ప్రైవేటు వైద్యశాలల్లో వైద్యం లభిస్తుంది. మీరు ఒకవేళ ఈ పథకం లబ్ధిదారుడు కానట్లయితే, వెంటనే ఈ పథకం కోసం అప్లై చేసుకోవడం మంచిది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ కూడా ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా మీరు సులభంగానే మీ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ స్కీం కింద ఏమేం సేవలు అందుబాటులోకి వస్తాయి.
వైద్య పరీక్షలు, ప్రీ-హాస్పిటలైజేషన్ చార్జీలు, ఔషధాలు, వైద్యంలో వినియోగించే ప్రోసీజర్ వస్తువులు, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, ల్యాబోరేటరీ సేవలు, మెడికల్ ఇంప్లాంటేషన్ సేవలు , వసతి సదుపాయాలు, ఆహారం, చికిత్స సమయంలో తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రిలో చేరిన తర్వాత 15 రోజుల వరకు సంరక్షణ వంటివి కవర్ అవుతాయి.

ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే ఎలా అప్లై చేయాలి..
ఆయుష్మాన్ భారత్ కార్డును పొందాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. . ఇందుకోసం భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి వెబ్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఏమేం డాక్యుమెంట్స్ కావాలి..
ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం మీరు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కూడా ఇందుకోసం ఉపయోగపడుతుంది.