Ganji Benefits: గంజి.. అని చులకనగా చూడొద్దు..! ఇలా తాగితే లాభాలు బోలెడు..

www.mannamweb.com


Ganji Benefits: గంజి.. అని చులకనగా చూడొద్దు..! ఇలా తాగితే లాభాలు బోలెడు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు

అన్నం వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి. అయితే, ప్రస్తుత కాలంలో గంజిని ఎవరూ వాడటం లేదు. అసలు గంజి వార్చే విధానం కూడా తగ్గిపోయింది. దానికి బదులుగా రైస్‌ కుక్కర్లు వచ్చేశాయి. అయితే, మీరు ఎప్పుడైనా అన్నం వాడుతూ వార్చిన గంజిని రుచి చూశారా..? ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి గంజి తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయని, మరీ ముఖ్యంగా మధుమేహులకు మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహంతో బాధపడేవారికి ఉడికించిన బియ్యం నీరు ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, బరువును తగ్గించడంలో కూడా గంజి ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్నం వండేటప్పుడు తీసివేసిన గంజి శరీర శక్తిని పెంచడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా మంది ప్రజల ఆహారంలో ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మరింత ముఖ్యమైనది. అన్ని శరీర వ్యవస్థలు బాగా పనిచేయడంలో హైడ్రేషన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రైస్ వాటర్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

అన్నం వార్చిన గంజిలో చిటికెడు ఉప్పు, అర చెంచా కొబ్బరినూనె కలిపి తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది. పోషకాలు సమృద్ధిగా ఉన్న గంజి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే, ఒక గ్లాస్ గంజిలో చిటికెడు ఉప్పు వేసి తాగడం వల్ల డయేరియా సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా ఇన్ ఫెన్షన్లు దరి చేరవు.

ఎముకలు గట్టి పడాలంటే రోజూ గ్లాసు గంజి తాగండి. ముఖ్యంగా మహిళలు రెగ్యులర్ గా గంజి తాగితే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. బియ్యంతో తీసిన గంజి మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలు, చిరుధాన్యాల ద్వారా తయారుచేసిన జావ వల్ల కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బరువు తగ్గాలనుకునేవాళ్లకు గంజి మంచి ప్రత్యామ్నాయం. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు. ఫైబర్ కంటెంట్ అధికం కాబట్టి త్వరగా ఆకలి వేయదు. అందుకే ప్రతిరోజూ గంజి గానీ, జావ గానీ తయారుచేసుకుని ఉదయం తాగితే మంచి పోషకాహారంగా, బరువు తగ్గించేందుకు పనిచేస్తుంది.