Beauty: ఈ క్యాప్సుల్స్‌తో ఇలా చేయండి.. ముఖం మెరిసిపోతుంది..
అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం అనేక మార్గాలను వెతుక్కుంటారు. ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
అయితే వీటికి భిన్నంగా విటమిన్ ఇ క్యాప్సుల్స్ కూడా అందాన్ని రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా.? విటమిన్ ఇ క్యాప్సుల్స్ చర్మానికి పోషణ అందిస్తుంది. ముడతలతో ఇబ్బంది పడే వారికి వీటిని బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను ప్రతీ రోజూ ముఖంపై అప్లై చేసుకోవడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. ముఖ్యంగా మొటిమలు తగ్గిన తర్వాత వచ్చే మచ్చలు తగ్గిపోతాయి. విటమిన్ ఇలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చర్మానికి రంగును తీసుకొస్తాయి. అంతేకాకుండా చర్మం మాయిశ్చరైజింగ్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. మొటిమలు కూడా తగ్గిస్తాయి, ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.
విటమిన్ ఇ క్యాప్సూల్స్ నుంచి తీసిన ఆయిల్‌ను ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ముందుగా అరచేతిలోకి ఆయిల్‌ను తీసుకొని వేళ్ల సహాయంతో ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. మెడపై కూడా అప్లై చేసుకున్నా మంచి రంగు వస్తుంది. ఇలా సుమారు
20 నిమిషాల పాటు మసాజ్ చేసుకొని తర్వాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది. దీనిని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్‌లో విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్‌ను కలిపి ఫేస్ ప్యాక్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
బాదం, కొబ్బరి, ఆలివ్ వంటి నూనెల్లో ఇ క్యాప్యూల్స్‌లోని ఆయిల్‌ను కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా 20 నిమిషాల తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఈ ఆయిల్‌ను అప్లై చేసే సమయంలో ముఖాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాతే ముఖానికి అప్లై చేసుకోవాలి. అయితే ముఖానికి అప్లై చేసుకునే సమయంలో వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలి. కొందరి చర్మం రియాక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.