Suryakumar Yadav: చరిత్రలో నిలిచిపోయే క్యాచ్‌

www.mannamweb.com


2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌.. 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సిక్సర్‌.. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలివి. ఈ ప్రపంచకప్‌లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్‌ను సూర్యకుమార్‌ అందుకున్నాడు.

2007 టీ20 ప్రపంచకప్‌లో శ్రీశాంత్‌ క్యాచ్‌.. 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోని సిక్సర్‌.. భారత క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సందర్భాలివి.

ఈ ప్రపంచకప్‌లోనూ అలాంటి చిరస్మరణీయమైన క్యాచ్‌ను సూర్యకుమార్‌ అందుకున్నాడు. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా.. హార్దిక్‌ వేసిన తొలి బంతిని మిల్లర్‌ గాల్లోకి లేపాడు. అది సిక్సర్‌ వెళ్లేలా కనిపించింది. అది కానీ బౌండరీ దాటి బయట పడి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో! కానీ వైడ్‌ లాంగాఫ్‌ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్య ఒక్క ఉదుటన బంతి అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయి బౌండరీ గీత దాటాడు. అయితే అంతలోపే బంతిని గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి ఆ బంతిని అందుకుని జట్టును ఆనందంలో ముంచెత్తాడు. అద్భుతంగా ఆ క్యాచ్‌ పట్టిన సూర్య టీమ్‌ఇండియా విజయంలో కీలకమయ్యాడు.