health tips: ఈ అనారోగ్య సమస్యలుంటే వెల్లుల్లిని అసలే తినొద్దు.. జాగ్రత్త!!

www.mannamweb.com


health tips: ఈ అనారోగ్య సమస్యలుంటే వెల్లుల్లిని అసలే తినొద్దు.. జాగ్రత్త!!

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ప్రతిరోజు వెల్లుల్లిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు.

వెల్లుల్లి మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని చెప్తారు. అధిక రక్తపోటు కంట్రోల్ లోకి వస్తుందని, కడుపులో ఉండే టాక్సిన్స్ బయటకు పంపేందుకు కూడా పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినటం మంచిదని చెప్తారు.

పచ్చి వెల్లుల్లిని తింటే మంచిదేనా?

వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని చెబుతారు. ఆయుర్వేదంలో వెల్లుల్లిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే పచ్చి వెల్లుల్లి తింటే ఆరోగ్యం ఉంటుందని, ప్రతీ రోజూ పచ్చి వెల్లుల్లిని ఉదయం లేవగానే పరగడుపున తినాలని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను చూసి చాలామంది ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తినేస్తున్నారు.

పచ్చి వెల్లుల్లిని వీళ్ళు తినకూడదు

అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా కాదా.. వైద్య నిపుణులు ఏమంటున్నారు అంటే

పచ్చి వెల్లుల్లిని కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తినకూడదు. ఎవరు పచ్చి వెల్లుల్లిని తినకూడదు అంటే ఎసిడిటీతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు. ఉదయానే పరగడుపున అసలే తినకూడదు. ఎసిడిటీతో బాధపడుతూ పచ్చి వెల్లుల్లి తింటే వారికి జీర్ణ సమస్యలు తగ్గే బదులు పెరుగుతాయి. కడుపులో అల్సర్స్ ప్రమాదం పెరుగుతుంది.

వీళ్ళు వెల్లుల్లిని వాడితే డేంజర్

అంతే కాదు స్కిన్ ఎలర్జీలు ఉన్నవారు కూడా పచ్చి వెల్లుల్లి వాడకూడదు. ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లిలో రక్తాన్ని పలచన చేసే గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.

శస్త్ర చికిత్స చేసుకున్నవారు వెల్లుల్లి వాడటం మంచిది కాదు

అయితే శస్త్ర చికిత్స చేసుకున్నవారు పచ్చి వెల్లుల్లి తినడం మంచిది కాదు. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల శస్త్ర చికిత్స చేసుకున్న వారిలో రక్తస్రావం అయ్యే సమస్య పెరుగుతుంది. రక్తహీనత, తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు. ఒకవేళ వారు పచ్చి వెల్లుల్లిని తింటే రక్తపోటు స్థాయి మరింత తగ్గే ప్రమాదం ఉంది.