పెన్షన్లపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన టీడీపీ

www.mannamweb.com


జులై నెల 1, 2 తేదీల్లో పెన్షన్ తీసుకోనివారు ఇకముందు అనర్హులవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని TDP స్పష్టం చేసింది. 3 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పారని గుర్తుచేసింది.

అయినా వైసీపీ దీనిపై దుష్పచారం చేస్తోందని మండిపడింది. ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తాం అంటూ వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అంటూ Xలో పోస్ట్ చేసింది.

ఇక జులై నెల 1వ తేదీ నుంచి ఏపీలో పెరిగిన పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఫిక్సయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈ పింఛన్ల పంపిణీలో పాలుపంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తానే స్వయంగా పెన్షన్ దారుల ఇంటింటికీ వెళ్లి పంచాలని డిసైడ్ అయ్యారట. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టిన సీఎం.. పెన్షన్స్ పంపిణీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.అయితే తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించబోతున్నారట సీఎం చంద్రబాబు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారట. దేశ చరిత్రలో ఓ సీఎం స్వయంగా పెన్షన్ పంపిణీ చేయడం ఇదే తొలిసారి అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.