Lifestyle: ఈ డ్రింక్స్‌ తాగితే.. శరీరంలో మలినాలన్నీ పరార్‌ అంతే..

www.mannamweb.com


నిత్యం అనారోగ్య సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి టాక్సిన్స్‌. శరీరంలో టాక్సిన్స్‌ పేరుకుపోవడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు నిత్యం వస్తుంటాయి. ఈ టాక్సిన్స్‌ను శరీరం నుంచి తొలగిస్తే వ్యాధుల బారిన పడడం కూడా తగ్గుతుంది. మరి టాక్సిన్స్‌ను తొలగించుకోవడానికి కొన్ని రకాల డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సహజంగా లభించే ఈ డ్రింక్స్‌ ద్వారా పొట్ట శుభ్రంకావడంతో పాటు, శరీరంలోని క్రిములు చనిపోతాయి. ఇంతకీ ఆ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పసుపుతో చేసే టీ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను నివారిస్తాయి. దీనివల్ల కడుపు సంబంధిత రుగ్మతలు నివారించవచ్చు.

* గ్రీన్‌ టీని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరం శుభ్రంగా మారుతుంది. గ్రీన్‌ టీలో శరీరాన్ని శుభ్రపరిచే యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో గ్రీన్‌ టీ ఉపయోగపడుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.

* నిమ్మకాయ, అల్లం రసాన్ని కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా తొలగిపోతాయి. అల్లంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఉదయం లేవగానే ఈ డ్రింక్‌ తాగితే ఎంతో మేలు జరుగుతుంది.

* కొబ్బరి నీటిని తాగడం వల్ల కూడా శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి. కొబ్బరి నీరు పేగు కదలికను పెంచుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రోజూ ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగితే కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయి.

* జామకాయ ఆకులతో చేసిన కషాయం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లివర్‌లో దెబ్బతిన్న కణాలను రిపేర్‌ చేస్తుంది.

* వాము నీటిని తీసుకోవడం వల్ల కూడా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన వామును ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి.