Healthy lifestyle: సాధారణంగా కొన్ని రకాల ఆహారాలు మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలను అందిస్తాయి.. అలాంటి కొన్ని రకాల ఆహారాలను డైలీ మనం తీసుకున్నట్లయితే..
ఇక డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన.. అవసరం ఉండదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు చెప్పబోయే ఒక క్యాల్షియం ఫుడ్.. కేవలం పరగడుపున ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పని ఉండదట. అవే తెల్ల నువ్వులు.
మామూలుగా నువ్వుల ఉండలు, నువ్వుల పొడి ఇలా రకరకాలుగా నువ్వులతో తయారు చేసిన ఆహారాలను మనం తీసుకుంటూ ఉంటాం. ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులను.. రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నువ్వులను తిని.. ఆ నీటిని తాగితే ఎక్కడలేని పోషకాలు మన శరీరానికి లభిస్తాయి.
ముఖ్యంగా ఈ నువ్వుల నుంచి కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. పైగా ఐరన్, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఇలా వీటిని మనం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తినడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది చిన్నవయసులోనే ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు, గజిబిజి లైఫ్ స్టైల్ కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు చిన్నవయసులోనే తలెత్తుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి చిట్కాలను పాటిస్తే చిన్న వయసులో వచ్చే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
గుప్పెడు బాదంపప్పులో లభించే కాల్షియం కంటే ఆరు రెట్లు నువ్వుల ద్వారా మనకు లభిస్తుంది. నువ్వులను పొడి చేసుకోనైనా తినవచ్చు.. అయితే నువ్వులను పొడి చేసుకోవడానికి సమయం లేదు అనుకునే వారికి తెల్ల నువ్వుల నుండి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పిని తెలగపిండి అనే పేరుతో మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. దీనిని మీరు కూరలో వేసుకొని తిన్నా సరే కావలసినంత ఫైబర్ మీకు లభిస్తుంది. ముఖ్యంగా నువ్వుల గింజలలో ఉండే ఖనిజాలు రక్త ప్రవాహంలో చేరి అధిక ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎముకలు బలంగా మారి పటిష్టంగా ఉండాలి అంటే నువ్వుల పొడి తినాల్సిందే.