TG TET: ఇక టెట్‌ ఏటా రెండుసార్లు

www.mannamweb.com


ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు.

హైదరాబాద్‌: ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబరు 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18 జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబరులో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొన్నారు.

ఏటా ఒకసారి టెట్‌ నిర్వహిస్తామని 2015లో జీవో 36 జారీ చేసినా ఇప్పటి వరకు ఐదుసార్లు మాత్రమే పరీక్ష జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు చేపట్టలేదు. మళ్లీ 2022, 2023, 2024లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012(రెండుసార్లు), 2014లో టెట్‌ జరిగింది.