Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అటుకుల్లో ఇది కలిపి తినండి

www.mannamweb.com


Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అటుకుల్లో ఇది కలిపి తినండి

Joint Pains:మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారా.. అటుకుల్లో ఇది కలిపి తినండి .. మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ,అముమ్మలకు ఉండేవి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి.

ప్రతి ఐదుగురిలో ఒకరికి కీళ్ల నొప్పులు ఉంటున్నాయి. వీటికి ప్రధాన కారణం జీవనశైలి, తీసుకొనే ఆహారం,జంక్ ఫుడ్ తినటం,బోన్ కి అవసరమైన పోషణ లేకపోవటం.

కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన కీళ్ల నొప్పులు వస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి.మోకాళ్ల నొప్పులు వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది.

ఆ బాధ భరించటం చాలా కష్టం. ఆ బాధ భరించలేక చాలా మంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అటుకులు, నాలుగు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేస్తే పెరుగులో అటుకులు నాని మెత్తగా అవుతాయి.

పెరుగులో నానిన అటుకులను ప్రతి రోజు తినాలి. వీటిని ఏ సమయంలోనైనా తినవచ్చు. పెరుగు,అటుకులు రెండింటిలోనూ కాల్షియం ఉండటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

అటుకుల్లో పెరుగు కలిపి తినటం కష్టంగా ఉంటే కొంచెం తాలింపు పెట్టుకొని తినవచ్చు. ప్రతి రోజు అటుకులు,పెరుగు కలిపి తింటే మీకు ఆ తేడా వారంరోజుల్లోనే కనపడుతుంది. పెరుగులో అటుకులు కలిపి దద్దోజనం లాగా తీసుకోవడం వల్ల కాల్షియం బాగా శరీరానికి అందేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.