Common cold: జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ? ఈ సూప్ ట్రై చేయండి
Common cold: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ తరుణంలో చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వైరస్ వంటి ప్రమాదకరమైనవి కూడా వ్యాపిస్తుంటాయి. మరోవైపు జలుబు, జ్వరం, దగ్గు వంటివి కూడా పీడిస్తుంటాయి. ఈ తరుణంలో జలుబు, జ్వరం తగ్గడానికి మందులు వాడుతూ ఉంటారు. ఆవిరి పట్టడం, కషాయం వంటివి తాగడం వంటివి తరచూ చేయడం వల్ల ఇలాంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తినప్పుడు సరిగా ఆహారం తీసుకోలేకుండా గొంతు ఇబ్బందులకు గురిచేస్తుంది.
గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది. అంతేకాదు గొంతు నొప్పి తగ్గాలన్నా కూడా వేడి వేడి చికెన్ సూప్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ సూప్ వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. శరీరానికి ఎనర్జీ కావలన్నా కూడా చికెన్ సూప్ తాగితే మంచిది అంటున్నారు.
దీనిలో ఉండే అమినో యాసిడ్లు శరీరానికి అందడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఆకలిగా లేని సమయంలో, ఆహారం తినడానికి ఇబ్బందిగా అనిపించినపుడు మాంసాహారంతో తయారుచేసిన సూప్ మెదడు నరాలను యాక్టివ్‌గా ఉండేలా తయారుచేస్తుంది.
గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు తలెత్తిన సమయంలో సూప్ తాగడం వల్ల నాలుకకు రుచిని అందేలా చేస్తుంది. ముఖ్యంగా ప్లూ, ముక్కు దిబ్బడ, జలుబు వంటివి సోకినపుడు తెల్ల రక్తకణాలు రక్తంలో కలిసిపోయి ఎఫెక్ట్ అయిన శరీర భాగానికి బలాన్ని చేకూర్చుతుంది. చికెన్ సూప్ తాగడం వల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అయితే చికెన్ సూప్ లో దినుసులు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసి తాగితే ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.