CM Chandrababu: తల్లికివందనం పథకం విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. BPL కుటుంబాల తల్లులకు ఈ పథకం వర్తించనుంది.
ఒకటో తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఆధార్‌నెంబర్ పొందాలని ఆదేశాలు ఇచ్చింది. 75 శాతం హాజరు ఉన్నవారికే తల్లికి వందనం అమలు చేయనుంది. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ప్రభుత్వం అందించనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికివందనం డబ్బులు, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధ్రువీకరణ ద్వారా అందజేస్తామని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.