రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త విధివిధానాలను తీసుకొచ్చింది. నిత్యం తక్కువ ఖర్చుతో లక్షలాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైలు శాఖ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు చేయనుంది.
రైలు ప్రయాణానికి ముందస్తుగా బుక్ చేసుకునే రిజర్వేషన్ టికెట్ల విషయంలో రైల్వే శాఖ కఠిన నియమాలు తీసుకొచ్చింది. చాలామంది తమ ప్రయాణానికి నెల నుంచి రెండునెలల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే అత్యవసర సమయాల్లో ప్రయాణం కోసం తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే వెలుసుబాటును కూడా భారత రైల్వే ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో టికెట్లు దొరకకపోతే.. వెయిటింగ్ టికెట్‌తోనే స్లీపర్, ఏసీ క్లాస్‌లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఆయా క్లాస్‌లో ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతుంది. దీనికి పరిష్కారంగా పాటు భద్రత విషయంలోనూ రైల్వేశాఖకు సవాల్‌గా మారింది.
నిజానికి, ఒక క్లాస్ టికెట్ కొనుగోలు చేసి.. మరో క్లాస్‌లో ప్రయాణించడం కూడా నేరం కింద పరిగణిస్తారు. తాజాగా ఈ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్, ఏసీ క్లాస్‌లో ప్రయాణించడం రద్దు చేసింది. అలా ఎవరైనా ప్రయాణిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ హెచ్చరించింది. కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ, స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ తాజాగా కఠిన నిబంధనలు జారీ చేసింది. ఇకపై వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణం చేస్తై దొరికితే రూ.250 జరిమానా విధిస్తారు. ఏసీ కోచ్‌లో పట్టుబడితే రూ.440 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనితో పాటు ఆ తర్వాత స్టేషన్ నుంచి అమలయ్యే ఛార్జీలను కూడా కలిపి వసూలు చేస్తారట. జరిమానా చెల్లించకుంటే రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ 137 ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని
కొందరు టికెట్లు కన్ఫర్మ్ చేసుకోకుండానే స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఎక్కి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ రైల్వే తాజా నిర్ణయంతో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఊరట కలిగినట్లైంది. ఏసీ క్లాస్‌లో ఇలాంటి ఘటనలు తక్కువగా జరిగినీ.. స్లీపర్ క్లాస్‌లో మాత్రం నిత్యం ఈ తరహా దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇకపై కన్ఫర్మ్ టికెట్లు లేకుండా స్లీపర్, ఏపీ బోగీల్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవు. అందుకే రైలు ఎక్కేముందు తమ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనే విషయం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.