Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నే కాల్చిన 20 ఏళ్ల కుర్రాడు ఇతనే- నేపథ్యమిదీ..!

www.mannamweb.com


Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నే కాల్చిన 20 ఏళ్ల కుర్రాడు ఇతనే- నేపథ్యమిదీ..!

అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధి కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ పై గన్ తో కాల్పులు జరిపి, అనంతరం సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల కాల్పుల్లో చనిపోయిన నిందితుడి వివరాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విడుదల చేసింది.

నిందితుడి ఫొటోతో పాటు నేపథ్యం, ఇతర వివరాలు ఇందులో ఉన్నాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

నిన్నపెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకెళ్లిన ఘటనపై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అని ఇప్పటికే ప్రకటించిన దర్యాప్తు సంస్ధ.. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అతని ఫొటోను విడుదల చేసింది. అతను కళ్లజోడు ధరించి కెమెరాలో నవ్వుతున్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తోంది.

ట్రంప్ ప్రసంగిస్తున్న వేదిక సమీపంలోని రూఫ్‌టాప్ నుండి సభలో పలుసార్లు కాల్పులు జరిపిన తర్వాత క్రూక్స్‌ను సీక్రెట్ సర్వీస్ స్నిపర్లు కాల్చి చంపారు. ఒక వ్యక్తి సమీపంలోని పైకప్పు నుండి పైకప్పుకు కదులుతున్నట్లు, ర్యాలీలో తుపాకీతో అతని కడుపుపై ​​పడుకోవడం గురించి భద్రతా అధికారులను హెచ్చరించడానికి వారు ప్రయత్నించారని సాక్షులు పేర్కొన్నారు. అతని మృతదేహం దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్, ఏఆర్-15 దొరికింది.

విచారణలో దర్యాప్తు సంస్ధ ట్రంప్ పై దాడి చేసిన నిందితుడు క్రూక్స్ ను సైలెంట్ గా ఉండే విద్యార్ధిగా గుర్తించారు. అలాగే అతను స్కూల్లోనూ ఒంటరిగా ఉండే వాడని తేలింది. 2022లో బెతెల్ పార్క్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లు తేల్చారు. అలాగే నేషనల్ మ్యాథ్ అండ్ సైన్స్ ఇనిషియేటివ్ నుండి 500 డాలర్ల “స్టార్ అవార్డు” కూడా అందుకున్నట్లు గుర్తించారు. అలాగే రిజిస్టర్డ్ రిపబ్లికన్ అని, రాబోయే నవంబర్ 5 ఎన్నికలలో అతను అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం ఇదే మొదటిసారి అయ్యేదని కూడా తెలుసుకున్నారు.

క్రూక్స్ సామాజికంగా రిజర్వ్‌డ్ అని విచారణలో దర్యాప్తు అధికారులకు తెలిపారు. అలాగే ఎప్పుడూ రాజకీయాలు లేదా ట్రంప్ గురించి చర్చించలేదని కూడా తెలిపారు. స్కూల్లో మాత్రం తరచుగా అతనికి బెదిరింపులు ఎదురైనట్లు వారు తెలిపారు. అవి ఎవరి నుంచో మాత్రం తెలియలేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత నిందితుడు క్రూక్స్ నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. దాడి తరువాత అతని కారులో ఓ అనుమానాస్పద పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దానిని బాంబు సాంకేతిక నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అధికారులు అతని ఫోన్ డేటాను తీసుకుని గుర్తించే పనిలో ఉన్నారు.