Watching TV: టీవీని ఎంత డెస్టెన్స్‌లో చూడాలో తెలుసా? పోనీ.. రోజుకు ఎంత సేపు చూడాలో కూడా తెలియదా..

www.mannamweb.com


గత కొన్ని దశాబ్దాలుగా మన జీవితంలో టీవీ ఒక భాగమై పోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినోద మాధ్యమాల్లో టీవీ కూడా ఒకటి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో, టీవీ కూడా స్మార్ట్‌గా మారింది. పరిమాణం, ప్రకాశం, వినోదం వంటి విషయాల్లో టీవీ చాలా రెట్లు స్మార్ట్‌గా తయారైంది.

స్మార్ట్ టీవీ, OTT ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాయి. రోజంతా టీవీ చూస్తూ, అందులో నిమగ్నమై ఉంచడానికి అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. అయితే ఎక్కువ సేపు టీవీ చూడటం కళ్లకు అంత మంచిది కాదు. మనలో చాలా మందికి ఇది తెలుసు. కానీ ఎవ్వరూ పాటించరు.

కళ్లను టీవీకి కనీస దూరం పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీవీ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి కళ్లకు మంచిది కాదు. అందుకే చాలా సేపు టీవీని చాలా దగ్గరగా చూస్తే, కళ్ళు త్వరగా అలసిపోతాయి.మదీని వల్ల చాలా మందికి తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. కాంతికి ఎక్కువసేపు బహిర్గతం కావడం రెటీనాపై కూడా ప్రభావం చూపుతుంది.

టీవీని కనీసం 10 అడుగుల దూరం నుంచి చూడాలని నిపుణులు అంటున్నారు. పిల్లల విషయంలో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. లేదంటే చిన్న వయసులోనే కళ్లు మసకబారుతాయి. రోజుకు 1 నుంచి 2 గంటలకు మించి టీవీ చూడకూడదని వైద్యులు చెబుతున్నారు.

నిరంతరం టీవీ చూడకుండా.. మధ్యమధ్యల్లో విరామం తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అంతేకాదు చీకటి గదిలో టీవీ చూడటం కూడా ప్రమాదమే.