పదవీ విరమణ పొందే ఆ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

www.mannamweb.com


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీ అమలుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. అలాగే 200 యూనిట్లకు ఉచిత కరెంట్, 500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో అంగన్ వాడీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి హామీ ఇచ్చారు.  తాజాగా అంగన్ వాడీ ఉద్యోగస్తులకు తెలంగాణ సర్కర్ మరో శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ప్రాథమిక విద్యాను ప్రోత్సహించేందుకు ‘అమ్మ మాట.. అంగన్‌వాడి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నిన్నటి నుంచి ప్రారంభంమైన ఈ కార్యక్రమం 20 వరకు కొనసాగించేందుకు ఐసీడీఎస్ సిబ్బంది సిద్దమయ్యారు. దీనికి సంబంధించి అంగన్ వాడీ టీచర్లకు విడతల వారీగా శిక్షణ ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చిన్నారులకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తారు. ఇదిలా ఉంటే.. అంగన్ వాడీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ ఓ గొప్ప శుభవార్త చెప్పారు.తెలంగాణ‌లో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇకపై పదవీ విరమణ పొందిన తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించబోతున్నట్లు ప్రకటించారు.

మంగళవారం రహమత్ నగర్ లో జరిగిన ‘అమ్మ పాట- అంగన్‌వాడి బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లకు తొలి ఒడి అమ్మ అయితే.. మలి ఒడి అంగన్ వాడీ కేంద్రాలే అని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్దితో పాటు క్రమ శిక్షణ నేర్పిస్తూ భావి భారత పౌరులకు గా తీర్చి దిద్దిదేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఇకపై రిటైర్‌మెంట్ తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష రూపాయలు బెనిఫిట్స్ కల్పిస్తామని అన్నాను. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేర్చుతుందని అన్నారు.