పొదుపు అలవర్చుకోకుంటే భవిష్యత్తులో ఆర్థిక కష్టాలు తప్పవు. సంపాదించిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఏ రూపంలో పొదుపు చేసుకున్న అత్యవసర సమయాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడంతా ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెట్టుబడిపై మంచి వడ్డీ రేట్లు అందించే పథకాల కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అధిక రాబడినిచ్చే పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాలు పోస్టాఫీస్ ద్వారా అమలవుతున్నాయి. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటే అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. ఇందులో రోజుకు 166 పెట్టుబడి పెడితే చాలు ఏకంగా చేతికి 3 లక్షలు అందుకోవచ్చు.
పోస్టాఫీస్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. వాటిల్లో రికరింగ్ డిపాజిట్ పథకం ఒకటి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలను అందుకోవచ్చు. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆదాయాన్ని బట్టి గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
రోజుకు 166 పెట్టుబడితో చేతికి 3 లక్షలు:
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో రోజుకు రూ. 166 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ నాటికి 3 లక్షలకు పైగా అందుకోవచ్చు. ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. రోజుకు 166 పెట్టుబడి అంటే నెల రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 60,000 జమ అవుతుంది. ఐదు సంవత్సరాల్లో మీ పెట్టుబడి రూ. 3,00,000 అవుతుంది. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ.56,830 పొందుతారు. ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ ఆదాయంతో కలుపుకుని మొత్తం రూ. 3,56,830 రాబడిని అందుకుంటారు. రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్స్న్ పొందాలనుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.