Vande Bharat: ఆ రోజునే సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్.. ఏ రూట్‌లోనో తెల్సా

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు మాంచి ప్రజాదరణ లభించింది. పగటిపూట ప్రయాణించే ఈ రైళ్లు సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, చెన్నై-విజయవాడ, కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఆగష్టు 15న వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనుంది కేంద్ర రైల్వేశాఖ. సికింద్రాబాద్ నుంచి మూడు వందే స్లీపర్ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపించింది.

అయితే సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు ఆగష్టు 15న ప్రారంభం కానుందని సమాచారం. సికింద్రాబాద్ నుంచి ముంబై మార్గం మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుందట.

గతంలో సికింద్రాబాద్, పూణె మధ్య మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందంటూ వార్తలు వచ్చాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఈ రైలు ప్రారంభించాలని రైల్వే శాఖ భావించింది.

అయితే సికింద్రాబాద్-ముంబై మధ్య వందేభారత్ రైలు లేకపోవడంతో.. ఆ మార్గంలో వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చి.. సికింద్రాబాద్-పూణే మధ్య పగటిపూట నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను పరుగులు పెట్టించనుందట.