రక్తంలో షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంచే స్పెషల్ హెర్బల్‌ టీ.. ఒక్క కప్పుతాగినా చాలు!

www.mannamweb.com


రీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగా పనిచేయకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంది. ఫలితంగా మధుమేహం వస్తుంది. మధుమేహం వల్ల కళ్ళు, గుండె, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.

మధుమేహాన్ని నియంత్రించడానికి బంగాళదుంపలు, స్వీట్లు సహా అనేక రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా చేదు కూరగాయలతోపోటు వైద్యులు సూచించిన మందులు వినియోగించాలి.

అయితే ఈ కింది హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డయాబెటిస్‌ను నియంత్రించడానికి రోజూ మెంతి టీ తాగాలి. ఇందులో ఫైబర్, అమైనో ఆమ్లాలను అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మెంతుల టీ శరీర బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చాలా మంది గ్రీన్ టీ తాగేందుకు ఇష్టపడతారు. ఇది శరీర బరువును తగ్గించడం, జీవక్రియను మెరుగుపరచడం మాత్రమే కాకుండా, మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే క్యాటెచిన్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలో అల్లం టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయిని పెంచడంలోనూ సహాయపడుతుంది. మధుమేహం అదుపులో ఉండాలంటే రోజూ దాల్చిన చెక్క టీ తాగవచ్చు. ఇందులో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పైగా ఇన్సులిన్ హార్మోన్ను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

ఈ హెర్బల్ టీలను తీసుకోవడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.