ప్రస్తుతం పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఎలా జీవనం సాగించాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే వివిధ నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. వీటికి పోటీగా తామున్నామంటూ..కూరయాగాయలు కూడా వచ్చి చేరాయి. ఇటీవల కాలంలో కూరగాయల ధరలను పరిశీలిస్తే..పై పైకి వెళ్తున్నాయే తప్ప నేల వైపు చూడటం లేదు. ముఖ్యంగా టమాట ధర మరోసారి పేద, మధ్యతరగతి వారికి షాక్ ఇచ్చింది. కొన్ని రోజులుగా కాస్తా తగ్గుముఖం పట్టిన టమాట ధర..మళ్లీ పెరిగింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఈమధ్యకాలంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధర విషయంలో చికెన్, మటన్‌తో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం భారీగా టామాటా ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి. అయితే ఇటీవల కాస్తా తగ్గు ముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్ లో రూ.50 నుంచి రూ.60 కి లభిస్తున్నాయి. ఇక కాస్తా ధర తగ్గిందని సామాన్యులు సంతోష పడుతున్న వేళ మరోసారి టామాట షాకిచ్చింది. ఇప్పుడు మరోసారి రూ.80లకి చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే గ్రేడ్-ఏ రకం టమాటాలు అయితే రూ.100కు కూడా చేరాయి. వర్షాలకు దెబ్బతినడం, సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో కిలో టమాట రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. మరోవైపు ఇతర కూరగాయలు, ఆకుకూరల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. టమాటా ధరలు ఒక్కసారిగా దూసుకుపోతుండటంతో.. దాన్ని సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ సామాన్యులు, పేద, మధ్య తరగతి జనాలు టమాటా కొనాలంటేనే అమ్మో అంటున్నారు. మళ్లీ గతేడాది పరిస్థితులే వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోలానే ఈ ఏడాది కూడా టమాటా సాగు, దిగుబడి తగ్గడంతో.. ధరలు పెరిగాయి అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. రానున్న రోజుల్లో టమాటా ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలానే ప్రస్తుతం మార్కెట్లో టమాటా రేటుతో పాటు ఇతర కూరగాయాల ధరలు కూడా మండిపోతున్నాయి.
మొత్తంగా పెరిగిన నిత్యవసర వస్తువలకు తోడు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరైతే టామాటలను కొనేందుకు కూడా వెనుకడుకు వేస్తున్నారు. కొన్ని రోజులు టమాటాలను కొనకుండా ఉంటే మేలు అనే భావనలో ఉన్నారు. మొత్తంగా పెరిగిన టామాటా ధరలతో సామాన్యులకు మరోసారి షాక్ తగిలినట్లు అయింది. మరి..టమాటా ధరలు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.