దశాబ్ద కాలం నుంచి చంద్రుడిపై ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు అనేవి ప్రారంభమైయ్యాయి. అయితే ఈ ప్రయోగాల్లో భాగంగానే ప్రపంచ దేశాలు ఒకదానితో ఒకటి పోటత పొడుతున్నాయి. ఇకపోతే వాటిలో అమెరికా, చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు చంద్రుడిపై ఇప్పటికి ఎన్నో ప్రయోగాలు చేస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై అనేక శాటిలైట్లను పంపిస్తున్నారు. అలాగే జాబిల్లిపై మానవులు జీవిస్తారా.. అందుకు అనువైన వాతావరణం ఉందా. అక్కడి పరిస్థితులు ఏంటి ఇళ్లు, రోడ్లు, కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చా అనే విషయాలను పరిశోధిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడ మట్టి, వాయువులు, ఖనిజాలు సేకరించి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొంతమంది శాస్త్రవేత్తలు చంద్రునిపై భూగర్భ గుహను కనుగొన్నారు. పైగా ఇది మానవులకు నివాసయోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. మరి, ఆ వివరాళ్లేంటో చూద్దాం.
ఇప్పటి వరకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలైనా అమెరికా, చైనా రష్యా వంటి దేశాలు చంద్రుడిపై ఎన్న పరిశోధనలు చేస్తున్నాయి. ఎందుకంటే.. భవిష్యత్తులో జాబిల్లి పై మానవులు నివాసానికి అనుకూలమైన వాతవరణం ఉంటుదా అనే విషయాలను తెలుసుకోనేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జాబిల్లి ఎన్నో శాటిలైట్స్ ను పంపిస్తూ.. అక్కడ మట్టి, వాయువులు, ఖనిజాలు సేకరించి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శాస్త్రవేత్తలు చంద్రునిపై భూగర్భ గుహను కనుగొన్నారు. కాగా, ఇది మానవులకు నివాసయోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇక ఈ గుహ చంద్రునిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో ఉన్న ఒక భారీ గొయ్యి లోపల ఉందని, పైగా ఈ గొయ్యి చంద్రునిపై తెలిసిన లోతైన ప్రాంతమని పేర్కొన్నారు. అలాగే ఇది నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రునిపైకి తీసుకువచ్చిన అంతరిక్ష నౌక అపోలో 11 ల్యాండింగ్ అయిన సైట్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే చంద్రునిపై ఈ గుహను ఇటలీలోని ట్రెంటో యూనివర్సిటీకి చెందిన లోరెంజో బ్రూజోన్, లియోనార్డో క్యారెర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. ఇక వారు తమ పరిశీలనలను సైంటిఫిక్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. ఇందులో శాస్త్రవేత్తలు రాడార్‌ను ఉపయోగించి గొయ్యి తెరవడం ద్వారా లోపలికి వెళ్లేలా చేశారు. కాగా, అందులో మిలియన్ల సంవత్సరాల క్రితం చంద్రుని ఉపరితలం క్రింద ప్రవహించిన లావా కారణంగా.. ఈ గొయ్యి లోపల గుహ ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ గొయ్యి మానవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.