ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు.. వేలల్లో పెట్టుబడితో లక్షల్లో రాబడి

www.mannamweb.com


ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేవి భారతదేశంలో పెట్టుబడిదారులు పదవీ విరమణ పథకాలుగా ఉపయోగించే రెండు గ్యారెంటీ రిటర్న్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లుగా ఉన్నాయి.

అయితే ఈ పథకాలకు సుదీర్ఘ లాక్-ఇన్ పీరియడ్స్ ఉన్నాయి. ప్రతి పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను-మినహాయింపు లభిస్తుంది. ఈ పథకాలు రెండూ ఈఈఈ కేటగిరీలో వస్తాయి. ఇక్కడ పెట్టుబడి, సంపాదించిన పన్ను, మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితంగా ఉంటుంది. అలాగే ఈ రెండు పథకాల్లో పెట్టుబడిపై స్థిర వడ్డీ రేట్లను అందిస్తాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాల్లో రూ. 10,000 నెలవారీ పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పదవీ విరమణ పథకం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తున్న పథకం 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. కనీస బేసిక్ జీతం రూ.15,000 పొందే ఉద్యోగులు ఈపీఎఫ్ సభ్యులు కావచ్చు. ఉద్యోగికి సంబంధించిన ఈపీఎఫ్ ఖాతాలో ఖాతాదారు, ఉద్యోగి ఇద్దరూ సహకారం అందించాల్సి ఉంటుంది. కనీస సహకారం నెలకు రూ. 1,800 కాగా, గరిష్ట సహకారం ప్రాథమిక వేతనం, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 12 శాతంగా ఉంది. అలాగే యజమాని నుంచి వచ్చే 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ పింఛన్ ఖాతాకు వెళ్తే, 3.67 శాతం వారి ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కి వెళ్తుంది. మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం కాబట్టి ఈ రిటైర్‌మెంట్ పథకం అనేది భారతదేశంలో అత్యధిక రిటర్న్స్ ఇచ్చే పథకంగా మారింది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్

పీపీఎఫ్ అనేది పోస్టాఫీసు, బ్యాంకులు నిర్వహించే చిన్న పొదుపు పథకం. పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్‌లో 7.1 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్‌లో కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 చెల్లించకపోతే, పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ ఖాతాను నిలిపివేయవచ్చు. అలాగే ఖాతా వ్యవధిని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు.

రూ.10 వేల పెట్టుబడితో

ఈపీఎఫ్‌లో మీ నెలవారీ సహకారం రూ. 10,000 లెక్కన మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే ఆ కాల వ్యవధిలో మీ పెట్టుబడి రూ. 18 లక్షలు అవుతుంది. 8.25 శాతం చక్రవడ్డీతో మీ మొత్తం కార్పస్ రూ. 35,96,445.50 అవుతుంది. మీరు పోస్టాఫీసు పీపీఎఫ్ ఖాతాలో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే 7.1 శాతం వార్షిక వడ్డీతో, 15 సంవత్సరాలలో మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 32,54,567 అవుతుంది. తద్వారా మీరు ఈపీఎఫ్‌లో రూ. 3,41,878.5 ఎక్కువగా పొందవచ్చు. అయితే పీపీఎఫ్ పెట్టుబడి అనేది మీరు 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఈపీఎఫ్ అనేది రిటైర్‌మెంట్ పథకం, మెచ్యూరిటీ వయస్సు 60గా ఉంది. అయితే ఈ రెండు పథకాలు పాక్షిక ఉపసంహరణల ఎంపికను అందిస్తాయి.