Minister Achchennaidu: రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్

Minister Achchennaidu: రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్


రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఖరీఫ్ సీజన్‌ కోసం 1321 సహకార సంఘాల్లో విక్రేయించేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా లైసెన్స్ లేని సహకార సంఘాలకు తక్షణమే లైసెన్స్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఎరువుల విక్రయాల జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు.. ఈ మేరకు ఎరువులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌కు ఆంధ్రప్రదేశ్ పూర్తి సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.