బడ్జెట్ ఎఫెక్ట్.. రూ.3000 తగ్గిన బంగారం ధర! కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

www.mannamweb.com


పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా ఏడవ సారి పద్దును ప్రవేశపెట్టి రికార్డును సృష్టించారు. 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ. 48, 20, 512 కోట్లు కేటాయించారు. ఇందులో కొంత మందికి ఊరట.. మరికొంత మందికి నిరాశను కలిగించాయి. వేతన జీవులకు కొన్ని శ్లాబులు సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళ, పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించింది. అలాగే కొన్నింటిపై కస్టమ్స్ డ్యూటీలు పెంచడంతో పాటు తగ్గించింది. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్లపై బేసిక్ డ్యూటీని 1.5 శాతానికి పెంచింది. అలాగే బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించింది.

ఈ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ముఖ్యంగా మహిళలకు ఊరటనిచ్చినట్లు అయ్యింది. గతంలో బంగారం, వెండిపై సుంకం 15 శాతం ఉండగా.. అది 6 శాతానికి తగ్గించింది. ఇందులో బేసిక్ కస్టమ్ డ్యూటీ 10 శాతం నుండి 5 శాతానికి గ్గించారు. అలాగే అభివృద్ధి సెస్ 5 శాతం నుండి 1 శాతానికి తగ్గింది. అయితే నిపుణులు చెబుతున్న ప్రకారం.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతాయని, డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, బడ్జెట్‌లో బంగారం, కస్టమ్స్ పై సెస్ తగ్గించగానే.. ఇక్కడ గోల్ట్ అండ్ సిల్వర్ ధరలు కూడా ఢమాల్ అన్నాయి. ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం ధర 3 నుండి 4 వేల వరకు పడిపోయింది. ఇటు సిల్వర్ బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి.

మొన్నటి వరకు భయపెట్టిన గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు బడ్జెట్ ఎఫెక్ట్‌తో మరింత తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సుమారు మూడు వేల వరకు ధర తగ్గింది. స్వచ్ఛమైన పసిడి గ్రాము ధర 7,385 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 299 ధరలు తగ్గి.. రూ. 7,086 వద్ద స్థిర పడింది. పది గ్రాముల బంగారం ధర రూ. 70, 860గా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం గ్రాముపై రూ. 275 తగ్గగా.. పది గ్రాములపై 2750 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 64, 950కి చేరింది. మొన్నటి వరకు లక్ష మార్క్ చూసిన సిల్వర్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. కేజీపై రూ. 3, 500 వరకు తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 88 వేలుగా చూపిస్తుంది. కస్టమ్స్ డ్యూటీ రేట్ తగ్గుదల దీనికి కారణమని చెబుతున్నారు నిపుణులు. ఇది బంగారం కొనాలనుకునేవారికి మంచి సమయం అంటున్నారు