వచ్చే నెలలో భారీగా Bank సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

www.mannamweb.com


మరికొన్ని రోజుల్లో మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. జులై పోయి ఆగస్టు నెల రానున్నది. ఇక కొత్త నెల ప్రారంభమవుతుందంటే చాలు బ్యాంక్, గ్యాస్, క్రెడిట్ కార్డ్స్ ఇలాంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇక వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమకు లోన్స్, ఖాతాలకు సంబంధించిన సమస్యలు, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ సమస్యలకోసం బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆగస్టులో ఏయే తేదీల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే సమయం ఆదాతో పాటు మీ పనులు కూడా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఇంతకీ ఆగస్టులో ఎన్ని రోజులు సెలవులు రానున్నాయంటే.

బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది. ఆర్బీఐ లిస్ట్ ప్రకారం ఆగస్టులో మొత్తం 09 రోజులు సెలవులు ఉండనున్నాయి. శని, ఆదివారాలు, పండగలు కారణంగా 09 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంక్ సెలువులు ఉన్నప్పటికీ కూడా ఖాతాదారులు ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలు అందిస్తుండడంతో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, మనీ విత్ డ్రా కోసం ఏటీఎం సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఆగస్టులో ఏయే తేదీల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆగస్టులో బ్యాంక్ సెలువుల లిస్:

ఆగస్టు 4న ఆదివారం సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆగస్టు 10న రెండో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 11 ఆదివారం, దీని కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి, దేశవ్యాప్తంగా జాతీయ సెలవు.
ఆగస్టు 18న ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 19న రక్షాబంధన్ పండుగ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
ఆగస్టు 24 నెలలో నాల్గవ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఆగస్టు 25న ఆదివారం సెలవు కారణంగా బ్యాంకులు మూతపడతాయి.
ఆగస్టు 26 న జన్మాష్టమి సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.