OTTలోకి 18 సినిమాలు.. ఈ 4 మూవీస్ మాత్రం అస్సలు మిస్ కావొద్దు!

www.mannamweb.com


ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు లెక్కకి మించిపోతున్నాయి. అందుకే వారం వారం రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ల సంఖ్య కూడా పదికి దాటిపోతున్నాయి. ఈ వారంలో ఏకంగా ఓటీటీల్లోకి 18 సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. అయితే రోజుకు ఒక మూవీ చూసినా అది ఈ వారానికి తెగే సంఖ్య కాదు. అందుకే వాటిలో ఉన్న ది బెస్ట్ సినిమాలు చూడాలి అని అంతా అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటుంటే మాత్రం మీకోసం కొన్ని సజీషన్స్ తీసుకొచ్చాం. ఈ లిస్ట్ ప్రకారం మీరు ఆ 4 సినిమాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. అలా అయ్యారు అంటే కాస్త నిరాశ కూడా పడాలి. ఎందుకంటే యాక్షన్, డ్రామా, ఫాంటసీ, కామెడీ ఇలా అన్ని జానర్స్ సినిమాలు ఉన్నాయి. మరి.. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
ఆహా:

రాజు యాదవ్
గ్రాండ్ మా (తమిళ్)
కాళ్ (తమిళ్)
భరతనాట్యం- జులై 27

నెట్ ఫ్లిక్స్:

ది డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్)- జులై 25
టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్)- జులై 25
క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్)- జులై 25
ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీస్ సిరీస్)- జులై 26
ఘెస్ట్ బస్టర్స్: ఫ్రోజెన్ ఎంపైర్ (ఇంగ్లీష్ మూవీ)- జులై 26
ది డ్రాగెన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్)- జులై 26

హాట్ స్టార్:

చట్నీ సాంబార్(తమిళ్ సిరీస్)- జులై 26
బ్లడీ ఇష్క్ (హిందీ)- జులై 26

జీ5:

ఛల్తే రహే జిందగీ (హిందీ)- జులై 26
భయ్యాజీ (హిందీ)- జులై 26

ఆపిల్ ప్లస్:

టైమ్ బ్యాండిట్స్ (ఇంగ్లీష్ సిరీస్)
వన్ లైఫ్ (ఇంగ్లీష్)- జులై 25
జియో సినిమా: విచ్ బ్రింగ్స్ టూ మీట యూ (ఇంగ్లీష్)
ప్రైమ్

వీడియో: ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మెన్లీ వార్ ఫేర్ (ఇంగ్లీష్)- జులై 25

ఈ మూవీస్ లో చాలా వరకు ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్లో ఉన్నాయి. అందుకే వాటికి సంబంధించి ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. కానే, ఉన్న వాటిలో అదిరిపోయే ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. గెటప్ శ్రీను హీరోగా చేసిన రాజు యాదవ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే తెలుగు కామెడీ మూవీ భరతనాట్యం కూడా అస్సలు మిస్ కాకూడదు. ఇంక కాస్త సీరియస్ నెస్ కావాలి అంటే మనోజ్ భాజ్ పేయీ నటించిన భయ్యాజీ ట్రై చేయచ్చు. ఇంక అవి కాకుండా.. హారర్ కావాలి అంటే చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ చేసిన బ్లడీ ఇష్క్ నచ్చేస్తుంది. అలాగే యోగిబాబు లీడ్ రోల్ ప్లే చేసిన చట్నీ సాంబార్ సిరీస్ కూడా మీకు మంచి వాచింగ్ థ్రిల్, ఫన్ ని అందిస్తుంది.