“ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీ”.. నితిన్ గడ్కరీ బిగ్ అనౌన్స్‌మెంట్..

www.mannamweb.com


ఎంత దూరం ప్రయాణిస్తే ఇక అంతే టోల్ ఫీజు..
పైలెట్ ప్రాజెక్టుగా రెండు నేషనల్ హైవేలపై అమలు..
రాజ్యసభలో నితిన్ గడ్కరీ బిగ్ అనౌన్స్‌మెంట్..

GNSS-Based Toll: వాహనదారులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ వసూలు చేసేలా కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ముందుగా ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ముందుగా ఈ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. ప్రయోగాత్మకంగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్‌ఎస్‌ఎస్) ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రాథమికంగా అమలు చేయాలని రహదారి మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు.

కర్ణాటకలోని NH-275లోని బెంగళూరు-మైసూర్ సెక్షన్, హర్యానాలోని NH-709లోని పానిపట్-హిసార్ సెక్షన్‌లో GNSS ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా తీసుకురాబోతోంది. బుధవారం లోక్‌సభలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానంతో వెల్లడించారు. వీటి ఫలితాల ఆధారం దేశంలో మిగతా రహదారులపై ఈ విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. ఈ విధానం వల్ల వాహనదారులకు అదనపు టోల్ భారం తగ్గే అవకాశం ఉంది.