Sahara Refund Amount : సహారా గ్రూప్‌నకు చెందిన 4 కోపరెటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న డబ్బును తిరిగిచ్చేందుకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లు ఇప్పుడు సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ .500000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోపరెటివ్ సొసైటీల్లో ప్రజలు దాచుకున్న డబ్బును తిరిగి తీసుకునేందుకు గతంలో రిఫండ్ పోర్టల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా రూ .500000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ.5,00,000 వరకు క్లెయిమ్స్ కోసం రీ-అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. మొత్తం రూ.5,00,000 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసే తేదీలను తరువాత ప్రకటిస్తారు. ఈ క్లెయిమ్ 45 పనిదినాల్లో ప్రాసెస్ చేస్తారు.
ఇప్పటికే 362 కోట్లు రిఫండ్
సహారా గ్రూప్‌నకు చెందిన 4.2 లక్షల మంది ఇన్వెస్టర్లకు ఈ ఏడాది జూలై 16 వరకు రూ.362.91 కోట్లు రిఫండ్ చేసినట్లు కేంద్రమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటుకు తెలిపారు. సీఆర్‌సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్ ద్వారా డబ్బును రిఫండ్ చేసినట్లు అమిత్ షా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
2023 మార్చి 29న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. చట్టబద్ధమైన పెట్టుబడిదారులు తమ నిధులను తిరిగి పొందడంలో సహాయపడటం దీని లక్ష్యం. 2024 జూలై 16 నాటికి సహారా గ్రూపునకు చెందిన 4,20,417 మంది పెట్టుబడిదారులకు రూ.362.91 కోట్లు విడుదల చేసినట్లు అమిత్ షా తెలిపారు.
మెుత్తం 9.88 కోట్ల మంది ఇన్వెస్టర్లు
సహారా గ్రూప్‌లో మొత్తం 9.88 కోట్ల మంది ఇన్వెస్టర్లకు చెందిన రూ.86,673 కోట్లు చిక్కుకుపోయాయి. సహారా గ్రూపునకు చెందిన సహకార సంఘాల నిజమైన సభ్యులు/ డిపాజిటర్ల ఫిర్యాదుల పరిష్కారానికి, చెల్లుబాటయ్యే డిపాజిట్ల చెల్లింపు కోసం సహకార మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు సహారా-సెబీ రిఫండ్ ఖాతా నుండి రూ .5000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్‌సీఎస్)కు బదిలీ చేయాలని ఆదేశించింది.
డిపాజిటర్లు నాలుగు సొసైటీలకు సంబంధించిన అన్ని క్లెయిమ్లను ఒకే క్లెయిమ్ అప్లికేషన్ ఫారం నుండి చేయాలని పోర్టల్ పేర్కొంది. పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన క్లెయిమ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. క్లెయిమ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే సొసైటీ టోల్ ఫ్రీ నంబర్లు సంప్రదించవచ్చు.
టోల్ ఫ్రీ నెంబర్లు
0522 6937100
0522 3108400
0522 6931000
08069208210