దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. గత నాలుగైదేళ్లుగా యూపీఐ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. చిన్న చిన్న కిరాణ దుకాణాలు మొదలు.. పెద్ద పద్ద మాల్స్ వరకు ప్రతి చోటా డిజిటల్ పేమెంట్స్ చెల్లుబాటు అవుతున్నాయి. దాంతో చేతిలో డబ్బులు తీసుకుని వెళ్లడం చాలా వరకు తగ్గింది. బ్యాంక్ ఖాతాలో డబ్బులుండి.. దానికి ఫోన్ నంబర్ కనెక్ట్ అయి ఉంటే చాలు. యూపీఐ యాప్స్ ద్వారా ఎక్కడైనా పేమెంట్స్ చేయవచ్చు. అయితే యూపీఐ యాప్స్ ద్వారా.. ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్సఫర్ చేయలేం. పెద్ద మొత్తంలో నగదు పంపాలంటే.. కచ్చితంగా బ్యాంకుకు వెళ్లి.. డబ్బులు డిపాజిట్ చేయాలి. అయితే ఇకపై ఇలా డబ్బులేయడం అంత సులవైన ప్రక్రియ కాదని చెబుతోంది దేశీయ కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). బడ్జెట్ మరుసటి రోజే కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇవి తెలుసుకోకుండా బ్యాంకుల్లో డబ్బులేయడానికి వెళ్తే.. చిక్కుల్లో పడతారని తెలుపుతున్నారు. ఇంతకు ఆర్బీఐ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి అంటే..
మనీ లాండరింగ్‌ను అరికట్టడం కోసం ఆర్బీఐ.. కొత్త రూల్స్ తీసుకువచ్చింది. నగదు డిపాజిట్స్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం.. ఇకపై బ్యాంకు నుంచి ఏవైనా లావాదేవీలు చేసినప్పుడు.. చెల్లింపుదారుడతో పాటు.. లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి కేవైసీ వివరాలను తప్పక రికార్డు చేయాల్సిందిగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని బ్యాంకులన్నింటికి ఇవి వర్తిస్తాయని తెలిపింది. అంటే ఇకపై మనీ డిపాజిట్ చేయాలంటే.. గతంలో మాదిరిగా బ్యాంకుకు వెళ్లి మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల కేవైసీ వివరాలు ఇవ్వకుండా ఇతరుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం కుదరదు. ఎవరి ఖాతాలో డబ్బు డిపాజిట్ చేస్తున్నామో.. వారి పూర్తి వివరాలను బ్యాంకుకు సమర్పించాలి. వాటిని అధికారులు రికార్డ్ చేస్తారు.
దేశీయ నగదు లావాదేవీలకు సంబంధించి.. ఆర్బీఐ 2011, అక్టోబర్‌లో జారీ చేసిన నిబంధనంలను తాజాగా సవరించింది. ఈ కొత్త నిబంధనలు 2024, నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం క్యాష్ పే ఔట్ సేవలకు సంబంధించిన సొమ్ములు అందుకున్న వ్యక్తి పేరు, చిరునామా వంటి వివరాలను బ్యాంకులు కచ్చితంగా స్టోర్ చేయాలి. అలానే నగదు డిపాజిట్ విషయంలోనూ.. సంబంధిత బ్యాంక్.. ఆ వ్యక్తుల వివరాలను నమోదు చేయాలి. ఫోన్ నంబర్‌తో పాటు.. కేవైసీ నిబంధనలను అనుసరించి.. గుర్తింపు పత్రం వివరాలను సేకరించాలని ఆర్బీఐ తెలిపింది. అలా కలెక్ట్ చేసిన వివరాలను.. ఐఎంపీఎస్, నెఫ్ట్ సందేశాల్లోనూ పొందుపరచాలని పేర్కొంది.