జాబ్ కావాలంటే ఇది బెస్ట్ ఛాన్స్.. లక్ష జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

www.mannamweb.com


జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోం పొందేందుకు ఇదే బెస్ట్ ఛాన్స్. మీరు ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ప్రయత్నమే చేయకుండా నిరాశ చెందితే ప్రయోజనం ఏముంటుంది. మరి మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఐఓసీఎల్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 443 జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీ చేయనున్నది. ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి లక్ష వరకు జీతం పొందొచ్చు. అభ్యర్థుల వయసు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య : 443
విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4: 256
జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4/ జూనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్-4: 99
జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌-4: 21
ఇంజినీరింగ్‌ అసిస్టెంట్: 38
టెక్నికల్: 29

అర్హత:

అభ్యర్థులు ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

18-26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, షార్ట్‌లిస్ట్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఉంటుంది. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.300 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

ఆగస్టు 21, 2024.