మాల్దీవులే కాదు ఈ ప్రాంతాలకు కూడా చాలా చవకగా తిరిగేయచ్చు, లక్ష రూపాయలుంటే చాలు

www.mannamweb.com


Honeymoon Places: విదేశాల్లో హనీమూన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలి, మాల్దీవులు వంటి ప్రాంతాలే. ఈ రెండే కాదు హనీమూన్ కోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇతర దేశాలకు కూడా వెళ్లవచ్చు. అలా లక్ష రూపాయల ఖర్చుతో వెళ్లి వచ్చేసే దేశాలు ఇవిగో.

పెళ్లితో పాటూ హనీమూన్ కూడా ప్లాన్ చేసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువే. ఎన్నో జంటలు విదేశాల్లో హనీమూన్ నిర్వహించుకోవాలని అనుకుంటారు. నిజానికి పెళ్లి తర్వాత వెళ్లే హనీమూన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలోనే నూతన భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారని చెబుతుంటారు. వైవాహిక జీవితంలో అలసట, ఒత్తిడిని దూరం చేసుకోవడం కూడా ఇది చాలా అవసరం.

హనీమూన్ ప్లాన్ చేయడంలో ఫ్లైట్స్ బుక్ చేయడం, హోటల్ రూమ్స్ బుక్ చేయడం, ట్రిప్పులు ప్లాన్ చేయడం వంటివి ఉంటాయి. కాబట్టి ముందుగానే చేస్తే ప్రయాణం సులువవుతుంది. అయితే, మొదట మీరు ఎక్కడికి వెళ్ళాలో మీరు ముందే నిర్ణయించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హనీమూన్ ప్రదేశం అనగానే బాలి, మాల్దీవులు గుర్తుకు వస్తాయి. ఈ రెండు ప్రదేశాలు బడ్జెట్ ఫ్రెండ్లీగా వెళ్లి రావచ్చు. చేతిలో లక్ష రూపాయలు ఉన్నా కూడా ఈ రెండు ప్రదేశాలకు వెళ్లి రావచ్చు. కేవలం ఈ రెండు ప్రాంతాలే కాదు… మరో అయిదు ప్రదేశాలకు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు.
న్యూజిలాండ్

భారతదేశం వెలుపల అత్యంత హ్యాపీ హనీమూన్ గమ్యస్థానాలలో న్యూజిలాండ్ ఒకటి. ఇక్కడ బంగీ జంప్ లతో మీ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇక్కడ మీరు లగ్జరీ క్రూయిజ్ లో కూడా వెళ్ళవచ్చు. తిరగడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి వాతావరణానికే మీ గుండె ఉత్తేజితమైపోతుంది.
స్విట్జర్లాండ్

మంచుతో కప్పిన పర్వతాలు, ప్రకాశవంతమైన రంగులలోని వృక్షసంపద చూడాలంటే స్విట్జర్లాండ్ వెళ్లండి. ఆ దృశ్యాలను మీరు వాస్తవంగా చూస్తే పరవశించిపోతారు. మీరు మీ భాగస్వామితో కలిసి స్విట్జర్లాండ్ వెళితే అది మరపురాని ప్రయాణంగా మారిపోతుంది. ఇక్కడ మీరు మీ భాగస్వామితో చిరస్మరణీయమైన రొమాంటిక్ క్షణాలను గడపవచ్చు.

శ్రీలంక

శ్రీలంక భారత్ కు అతి సమీపంలో ఉంది. భాగస్వామితో కలిసి హనీమూన్ కోసం ఈ ప్రాంతానికి వెళ్లొచ్చు. శ్రీలంకలోని నువారా ఎలియా ప్రాంతానికి వెళ్లి మీ భాగస్వామితో కలిసి ఒక కప్పు టీని ఆస్వాదించండి. అందమైన జలపాతాలు, తేయాకు తోటలు, పాత భవనాలను చూడాలనుకుంటే హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లండి.
థాయిలాండ్

భారతదేశం వెలుపల ఉత్తమ హనీమూన్ గమ్యస్థానాలలో థాయ్ లాండ్ ఒకటి. ఇక్కడ అందమైన కోహ్ ఫిఫి ద్వీపం ఒక ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానం. బీచ్ లో సేదతీరాలన్నా, స్నార్కెలింగ్ ఎంజాయ్ చేయాలన్నా థాయ్ లాండ్ వెళ్లొచ్చు. దీనికి కూడా పెద్దగా ఖర్చు కాదు.
టర్కీ

ఈ దేశం శతాబ్దాల చరిత్ర కలిగినది. టర్కీలో మీరు భాగస్వామితో కలిసి ఎయిర్ బెలూన్ లో ప్రయాణం చేయచ్చు. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ ప్రయాణం మీకు అందమైన మధుర క్షణాలను అందిస్తుంది.