రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిబంధనలు పాటించని బ్యాంకులకు భారీగా జరిమానాలు విధిస్తూ కొన్ని సందర్భాల్లో లైసెన్స్ ను సైతం రద్దు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆర్బీఐ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ పాసైతే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ అందించింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 94 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ కు ఎంపికైతే నెలకు లక్ష వరకు జీతం పొందొచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 16 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 94
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్): 66
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్):21
ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్): 07
అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 55200-99750 చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రారంభం:
25-07-2024
దరఖాస్తులకు చివరి తేదీ:
16-08-2024