బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజ్ కావడంతో.. బిగ్ బాస్ సందడి ఊపందుకుంది. కూర రుచిగా రావాలంటే.. అందులో మసాలా దినుసులు మంచి ముమ్మరంగా ఉండాలి. అలాగే ఆట రంజుగా సాగాలంటే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా కీలకం. అదిరిపోయేలా నాగార్జున హోస్టింగూ.. అద్భుతమైన టాస్క్‌లు ఉన్నా.. ఆ టాస్క్‌లను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే బిగ్ బాస్ ఆటలో మజా ఉండదు. కాబట్టి.. సీజన్ హిట్ అవ్వాలన్నా.. ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్సే కీలకం.
కాబట్టి.. ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై లేటెస్ట్ అప్డేట్స్తో పాటు.. అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు ప్రారంభం కావొచ్చు? కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉండబోతుంది. ఇంటర్వ్యూలు ఎలా సాగుతున్నాయి. మొత్తం ఎంతమంది హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందన్న వాటిపై కూడా ఓ లుక్కేద్దాం.
బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలుగులో మొట్టమొదటి సీజన్ 1 జూలై 16 ప్రారంభం కాగా.. రెండో సీజన్ జూన్ 10 ప్రారంభమైంది. ఇక మూడో సీజన్ జూలై 21న ప్రారంభ అయ్యింది. ఇక సీజన్ 4 నుంచి సెప్టెంబర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. నాలుగో సీజన్ ఏడో సీజన్ వరకూ సెప్టెంబర్‌లోనే బిగ్ బాస్ ప్రారంభ అవుతుంది. దానిలో భాగంగా ఈ ఎనిమిదో సీజన్ కూడా.. సెప్టెంబర్ నెల ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ‘కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ గేమ్ షో ప్రసారం అవుతుంది. ఇది.. సెప్టెంబర్ 01 ఆదివారం నాటితో ముగియనుండగా.. ఆ తరవాతి ఆదివారం నుంచి ‘బిగ్ బాస్ 8’ ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది.
మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా.. డిసెంబర్ 22 నాటితో బిగ్ బాస్ 8 ముగిసే అవకాశం ఉంది. ఇక నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. అన్నపూర్ణ స్టుడియోస్‌లోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతోంది. ఆగష్టు నెలాఖరు వరకూ బిగ్ బాస్ సెట్ వర్క్ అన్నపూర్ణ స్టుడియోలో జరగబోతుంది.
ఇక కంటెస్టెంట్స్ ఎంపికకి సంబంధించి మార్చి నెల నుంచి వేట మొదలుపెట్టగా.. దాదాపు 200 మందికి పైగా కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేసి.. వారికి ఫోన్ కాల్స్, మెయిల్స్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా కొంతమందికి మెయిల్స్ వెళ్తూనే ఉండగా.. జూలై తొలివారం నుంచి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్‌కి ఇంటర్వ్యూలు చేపట్టారు.
మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన ఈ 200 మంది కంటెస్టెంట్స్‌లో 50 మందిని ఫైనల్ చేసి.. ఆ యాభై మందిలో 20 మందిని హౌస్‌లోకి పంపబోతున్నారు. మరో ఐదుగుర్ని షార్ట్ లిస్ట్ చేసి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో స్టాండ్ బైగా ఈ ఐదుగుర్ని అందుబాటులో ఉంచబోతున్నారు. మొత్తం 25 మందిలో 22 మందిని హౌస్‌లోకి పంపబోతుండగా.. మరో ముగ్గురు సీజన్ 8 ముగిసే వరకూ కూడా హోటల్ గదికే పరిమితం కాబోతున్నారు. వారు హౌస్‌లోకి అడుగుపెట్టకపోయినా కూడా.. మొత్తం 106 రోజుల రెమ్యూనరేషన్ అందించనున్నారు. అయితే వీరిని ఆ తరువాతి సీజన్లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎంపిక చేసిన 22 మంది కంటెస్టెంట్స్‌ని కూడా చివరి నిమిషం వరకూ కూడా హౌస్‌లోకి పంపుతారనే గ్యారంటీ లేదు. ఇంటర్వ్యూలు జరిగి.. హోటల్ రూంలో పెట్టి.. ప్రోమో షూట్లు అయిన తరువాత కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి.. చివరి క్షణం వరకూ కూడా అంటే.. బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగుపెట్టే వరకూ కూడా ఫైనల్ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు చేర్పులైనా జరగొచ్చు. కాబట్టి ప్రస్తుతం సీజన్ 8లో కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఎవరెవరున్నారో చూద్దాం.
1. ఖయ్యం అలీ (Khayum Ali) అలీ తమ్ముడు, ప్రముఖ నటుడు
2. రేఖా భోజ్ (జనసైనికురాలు, నటి)
3. బమ్చిక్ బబ్లూ (కమెడియన్)
4. మై విలేజ్ షో అనిల్ (కమెడియన్)
5. యాదమరాజు (కమెడియన్)
6. సోనియా సింగ్ (నటి, యూట్యూబర్)
7. ప్రభాస్ శ్రీను (కమెడియన్)
8. రీతూ చౌదరి (యాంకర్)
9. అంజలి పవన్ (డాన్సర్, నటి)
10. శ్వేతా నాయుడు (ఢీ ఫేమ్)
11. అమృత ప్రణయ్
12. సాకేత్ (సింగర్)
13. హారిక (సీరియల్ నటి)
14. నిఖిల్ (సీరియల్ నటుడు)
15. శ్రీకర్ (సీరియల్ నటుడు)
16. రవి శివ తేజ (కమెడియన్)
17. అక్షిత (నీతోనే డాన్స్)
బర్రెలక్క, కుమారి ఆంటీ, యంకర్ విష్ణుప్రియ, యాంకర్ వింద్య విశాఖ ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే.. ఖయ్యం, రేఖా భోజ్లు ఇంటర్వ్యూ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. రీతూ చౌదరి కన్ఫామ్ అయినట్టు సమాచారం.