బొండాడ ఇంజనీరింగ్ షేరు 11 నెలల్లో రూ.75 నుంచి రూ.2900కు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ షేర్లు 3800 శాతానికి పైగా పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్‌కి సంతోషాన్ని ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో బొండాడ ఇంజినీరింగ్ ఒకటి! ఈ సంస్థకు చెందిన షేర్లు భారీ రాబడులను ఇచ్చాయి. 11 నెలల్లో బొండాడ ఇంజనీరింగ్ షేర్లు ఏకంగా 3800 శాతం పెరిగాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో కంపెనీ షేరు ధర రూ.2966.50 వద్ద ముగిసింది. ఐపీఓలో ఈ కంపెనీ ఒక్కో షేరు ధర రూ.75గా ఉంది. బొండాడ ఇంజినీరింగ్ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.3049.70. కంపెనీ షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.142.50గా ఉంది.
బొండాడ ఇంజినీరింగ్ షేర్ ప్రైజ్..
ఐపీఓలో బొండాడ ఇంజినీరింగ్ షేరు ధర రూ.75గా ఉంది. కంపెనీ ఐపీఓ 2023 ఆగస్టు 18న సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఆగస్టు 22 వరకు తెరిచి ఉంది. బొండాడ ఇంజినీరింగ్ ఐపీఓకు 112.28 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 100.05 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
2023 ఆగస్టు 30న బొండాడ ఇంజనీరింగ్ షేర్లు మార్కెట్లో రూ .142.50 వద్ద లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లు విపరీతమైన వృద్ధిని సాధిస్తున్నాయి. 26 జూలై 2024 నాటికి బొండాడ ఇంజనీరింగ్ షేరు రూ.2966.50కి చేరుకుంది. అంటే ఇష్యూ ధర రూ.75తో పోలిస్తే కంపెనీ షేరు 3800 శాతానికి పైగా పెరిగినట్టు. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6408 కోట్లు.
ఈ ఏడాది ఇప్పటి వరకు బొండాడ ఇంజనీరింగ్ స్టాక్
611 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి 1, 2024న కంపెనీ షేరు ధర రూ.417.10గా ఉంది. 2024 జూలై 26న బొండాడ ఇంజనీరింగ్ షేరు రూ .2966.50 వద్ద ముగిసింది. ఐదు రోజుల్లో 17శాతం, నెల రోజుల్లో 16శాతం మేర ఈ సంస్థ షేర్లు పెరిగాయి. అదే సమయంలో లిస్టింగ్ రోజు నుంచి కంపెనీ షేర్లు 1883 శాతం పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేరు ధర రూ.149.62 నుంచి రూ.2966.50కి పెరిగింది. గత ఆరు నెలల్లో బొండాడ ఇంజనీరింగ్ షేర్లు 343 శాతం పెరిగాయి.
మల్టీబ్యాగర్ స్టాక్స్ అనేవి తక్కువ కాలంలో అధిక లాభాలు ఇస్తాయి. కానీ అవి అంతే రిస్కీగా ఉంటాయి. ఈ విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తుపెట్టుకోవాలి. రిస్క్‌కి తగ్గట్టుగా రివార్డు ఉంటుందని గ్రహించాలి.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)