వంటకు ఎలాంటి ఆయిల్ వాడితే ఆరోగ్యానికి మంచిది.

www.mannamweb.com


నూనె లేకుండా ఇప్పుడు ఎలాంటి వంటలు కూడా తయారు కావడం లేదు. నూనెలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. కానీ సరైన మోతాదులోనే తీసుకోవాలి. మరీ ఎక్కువగా వాడితే..

అనారోగ్య సమస్యలు తప్పవు. మరి ఎలాంటి వంట నూనె ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

వంటకు రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని బియ్యం ఊక, గోధుమల పొర నుంచి తీస్తారు. వీటిల్లో చెడు కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వేరు శనగ ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

పూర్వం వంటలకు ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగించే వారు. ఈ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఈ నూనె తినడం వల్ల బీపీ, షుగర్, ఆర్థరైటీస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ వాడకం కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇది చాలా ఖరీదు. కానీ ఈ ఆయిల్ వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకపోగా.. ఉన్నా తగ్గుతాయి. రోజుకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నా పలు ఆరోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది.

పూర్వం వంటల్లో ఆవాల నూనె కూడా ఉపయోగించేవారు. ఆవాల నూనె కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో మంచి పోషకాలు ఉంటాయి. మంచి కొవ్వులు కూడా అందుతాయి. ఈ ఆయిల్ వాడటం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.