పారిస్ లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ 2024 జరుగుతున్నాయి. ఒలింపిక్స్‌కు ముచ్చటగా మూడోసారి ఆతిధ్యం ఇస్తోంది. 100 మందికి పైగా భారతీయులు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు.
అయితే 1924 పారిస్ ఒలింపిక్స్‌లో జరిగిన ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి భారతీయ మహిళ గురించి ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె లేడీ మెహెర్‌బాయి టాటా.. ఒలింపిక్స్‌లో టెన్నిస్ ఆడిన తొలి భారతీయ మహిళ. అంతేకాదు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెహెర్‌బాయి టాటా ఒలింపిక్స్‌తో సహా అన్ని టెన్నిస్ మ్యాచ్‌లను పార్శీ చీర ధరించి ఆడింది. ఆమె టెన్నిస్ లో మాత్రమే కాదు గుర్రపు స్వారీతో పాటు పియానోను కూడా భాగా ప్లే చేస్తారు కూడా.
అయితే మెహెర్‌బాయి టాటా మంచి క్రీడాకారిణి మాత్రమే కాదు.. మహిళాభ్యున్నతి కోసం పోరాటం చేయడమే కాదు శారదా చట్టంలో చేయడంలో కీలక పాత్ర పోషించిన టాటా వారి కోడలు గురించి నేటి తరానికి పెద్దగా తెలియదు.
లేడీ మెహర్‌బాయి టాటాకు క్రీడలపై అమితాసక్తి. ముఖ్యంగా టెన్నిస్ ఆడటం అంటే చాలా ఇష్టం. వివిధ టెన్నిస్ టోర్నమెంట్లలో 60కి పైగా బహుమతులు గెలుచుకున్నారు కూడా. అంతేకాదు ఒలింపిక్స్‌లో టెన్నిస్ ఆడిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెహర్‌బాయి టాటా ఏ టెన్నిస్ మ్యాచ్ ఆడుతున్నా పార్సీ చీర ధరించి ఆడేవారు. అంతేకాదు తన భర్త సర్ దొరాబ్జీ టాటా తో కలిసి వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో టెన్నిస్ మ్యాచ్‌లు వీక్షిస్తూ ఉండేవారు.
రతన్ టాటా, టాటా స్టీల్ కంపెనీ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కంపెనీ వద్ద డబ్బు లేని సమయం ఉందని మీకు తెలుసా? ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు లేడీ మెహర్‌బాయి టాటా తన సహకారం అందించారు. ప్రసిద్ధ కోహినూర్ వజ్రం కంటే రెట్టింపు పరిమాణంలో ఉన్న తన జూబ్లీ వజ్రాన్ని తాకట్టు పెట్టి కంపెనీని కాపాడింది.
లేడీ మెహెర్‌బాయి టాటా టాటా స్టీల్ కంపెనీ స్థాపకుడు జామ్‌సెట్‌జీ టాటా పెద్ద కుమారుడు సర్ దొరాబ్జీ టాటా భార్య. ఆమె మొదటి భారతీయ స్త్రీవాద చిహ్నాలలో ఒకరిగా పరిగణించబడుతున్నారు.
లేడీ మెహర్‌బాయి టాటా బాల్య వివాహాల నిర్మూలన నుండి మహిళల ఓటు హక్కు, బాలికల విద్య , పర్దా వ్యవస్థపై నిషేధం వరకు అనేక పోరాటాలు చేసి మహిళాభ్యున్నతి కోసం పాటుపడింది.
చట్టసభల్లోకి మహిళల ప్రవేశం కోసం గళం విప్పిన తొలి మహిళ కూడా ఆమె. ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న నేపధ్యంలో మెహెర్‌బాయి టాటా ఒలంపిక్స్ లో ఆడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కరు కొడుతోంది.