బడికి పోవాలంటే ఈదాల్సిందేనా

www.mannamweb.com


గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సిలో వాగులు గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు ఇప్పటికీ రాకపోకలు స్తంభించిపోయాయి. నిత్యవసర సరుకుల కోసం గిరిజనులు కష్టాలు అన్నీ కావు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా వాగుల్లో ఇంకా ఉదృతి కొనసాగుతూనే ఉంది. పాఠశాలలో తెరుచుకున్నా.. బడికి వెళ్దామంటే వెళ్లలేని పరిస్థితిలు. ఈ క్రమంలో ప్రమాదకరమైన గెడ్డలను దాటుకుంటూ విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి.

అల్లూరి ఏజెన్సిలో గెడ్డల ఉద్ధృతితో పాఠశాలలకు వెళ్లేందుకు గిరిజన విద్యార్థులు సాహసమే చేస్తున్నారు. కొట్నాపల్లి పంచాయతీ పందిమెట్టు, చింతకొట్టు గ్రామాల్లో విద్యార్థులు గెడ్డ దాటి కొట్నాపల్లి పాఠశాలకు వెళ్ళాలి. దింతో కొంతమంది పిల్లలు ఈదుకుంటూ గడ్డదాటుతుంటే.. మరి కొంతమంది తమ పిల్లలను స్వయంగా భుజాన ఎత్తుకుని తల్లిదండ్రులు గెడ్డ దాటిస్తున్నారు. పందిమెట్టు వద్ద కాజ్వేను ఆనుకొని రహదారి ఏర్పాటుకాక పోవడంతో అక్కడ కూడా గెడ్డలో దిగి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. దీంతో ఈ ప్రాంతంలో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కోట్నాపల్లి వద్ద వంతెన నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు.