సంతోషంగా ఉండాలంటే.. వెంటనే వీటిని వదిలేయాలి

www.mannamweb.com


సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఏ పని చేసినా, ఎంత సంపాదించినా అంతిమ లక్ష్యం మాత్రం సంతోషమే. అయితే సంతోషం అనేది మన పక్కన వారి చేతిలో ఉంటుందని భావిస్తుంటాం. కానీ నిజమైన సంతోషం మనలోనే ఉంటుంది. మనం చేసే పనులే మన సంతోషాన్ని నిర్ణయిస్తాయి. అయితే జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉంటే చాలనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజమైన సంతోషం కావాలంటే కొన్ని రకాల వాటికి దూరంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తన కోపమే తన శత్రువు అని చిన్నతనం నుంచే మనకు చెబుతుంటారు. మనిషి సంతోషాన్ని హరించే ప్రధానమైంది కోపమే. కోపం వల్ల మీ సంతోషం దూరం కావడమే కాకుండా పక్కన వారి సంతోషాన్ని కూడా మీరు హరించిన వారవుతారు. కోపంగా ఉండడం వల్ల ఒంటిరగా మిగిలిపోతారు, మీకు సమాజంలో గౌరవం లభించదు. కోపంగా ఉన్న వారితో ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడరు. కాబట్టి సంతోషంగా ఉండాలంటే కోపం నుంచి బయటపడాల్సిందే.

* మనిషి సంతోషాన్ని దూరం చేసే వాటిలో అహంకారం కూడా ఒకటి. అహంకారం కారణంగా మనుషులు దూరం పెడుతుంటారు. ఎన్నో సమస్యలకు అహంకారమే కారణమవుతుంది ఈ లక్షణాన్ని ఎదుటి వ్యక్తులు అస్సలు ఆహ్వానించరు. అహంకారం ఉండడం వల్ల సంతోషం దూరమవుతుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా అహంకారాన్ని వదులుకోవాల్సిందే.

* అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. అబద్ధాలు చెప్పే వారిని నిత్యం ఏదో తప్పు చేశామన్న భావన వెంటాడుతుంటుంది. వీరు సంతోషంగా ఉండలేరు. అందుకే ఈ అలవాటును మార్చుకోవాలి.

* ఇతరులపై ఈర్శ్య ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. పక్కనున్న వారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఇతరుల విజయాలను స్వీకరించలేని వారు అస్సలు సంతోషంగా ఉండరు. కాబట్టి మనకున్న ఆస్తి, అంతస్తుతో సంబంధం లేకుండా సంతోషంగా ఉండాలంటే పైన చెప్పిన లక్షణాలను వదులుకుంటేనే మంచిది.