మీ డబ్బుకు 8.75 శాతం వడ్డీ.. ఈ బ్యాంకులో స్పెషల్ స్కీమ్.. లక్ష జమ చేస్తే ఎంతొస్తుందంటే

www.mannamweb.com


FD Rates: బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని చూస్తున్న వారికి శుభవార్త అందించింది ప్రైవేట్ రంగంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బీఎల్ బ్యాంక్ (RBL Bank). రూ. 3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లను జులై 29, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ప్రస్తుతం ప్రత్యేక టెన్యూర్‌ ద్వారా గరిష్ఠంగా 8.75 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. మరి కొత్త వడ్డీ రేట్లు ఏ టెన్యూర్‌కు ఎంత ఉన్నాయనే పూర్తి లిస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం.

500 రోజుల స్పెషల్ స్కీమ్..
ఆర్‌బీఎల్ బ్యాంక్ ప్రస్తుతం 500 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్ గల ప్రత్యేక డిపాజిట్ పథకం ద్వారా జనరల కస్టమర్లకు 8.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 8.60 శాతం వడ్డీ అందిస్తోంది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే ఏకంగా 8.85 శాతం వడ్డీ అందిస్తోంది. ఇందులో ఒక సాధారణ కస్టమర్ రూ.1 లక్ష జమ చేసినట్లయితే 500 రోజుల తర్వాత వడ్డీ అసలు కలిపి రూ.1,08,900 వరకు అందుతాయి. అదే సీనియర్ సిటిజన్ అయితే 8.60 శాతం వడ్డీ రేటుతో రూ.1,09,440 వరకు వస్తాయి. అలాగే 80 ఏళ్ల వయసు పైబడిన సూపర్ సీనియర్లకు అయితే 8.75 శాతం వడ్డీతో రూ. 1,09,600 వరకు అందుతాయి.

ఆర్‌బీఎల్ బ్యాంక్ లేటెస్ట్ ఎఫ్‌డీ రేట్లు..

7 రోజుల నుంచి 14 రోజులకు జనరల్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ ఇస్తోంది.
15-45 రోజులకు 4 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల డిపాజిట్లకు 4.50 శాతం వడ్డీ అందిస్తోంది.
91 రోజుల నుంచి 180 రోజులకు 4.75 శాతం, 181 రోజుల నుంచి 240 రోజులకు 5.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
241 రోజుల నుంచి 364 రోజుల డిపాజిట్లకు 6.05 శాతం వడ్డీ ఇస్తోంది.
365 రోజుల నుంచి 452 రోజులు (12 నెలల నుంచి 15 నెలలలోపు) వరకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది.
453 రోజుల నుంచి 499 రోజులు (15 నెలల నుంచి 16 నెలల 14 రోజులు) వరకు 7.80 శాతం వడ్డీ అందిస్తోంది.
500 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా 8.10 శాతం వడ్డీ అందిస్తోంది.
501 రోజుల నుంచి 545 రోజులు (16 నెలల 16 రోజుల నుచి 18 నెలలలోపు) అయితే 7.80 శాతం వడ్డీ అందిస్తోంది.
546 రోజుల నుంచి 24 నెలల వరకు 8 శాతం, 24 నెలల 1 రోజు నుంచి 36 నెలలకు 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
36 నెలల 1 రోజు నుంచి 60 నెలల 1 రోజుకు 7.10 శాతం, 60 నెలల 2 రోజుల నుంచి 120 నెలలకు 7 శాతం వడ్డీ అందిస్తోంది.
ఇక 5 ఏళ్ల టెన్యూర్ గల ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లకు 7.10 శాతం వడ్డీ ఇస్తోంది.
పైన పేర్కొన్న టెన్యూర్లపై సీనియర్ సీటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 75 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ ఇస్తోంది.