మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ స్పెషల్ టీ దివ్యౌషధం… రోజూ 5 కప్పులు తాగాలి.

www.mannamweb.com


మనిషి ఉరుకుల పరుగుల లైఫ్‌లో బిజీగా మారాడు, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో అనేక అనారోగాలకు గురవుతున్నాడు. ముఖ్యంగా ఈరోజుల్లో జనం ఎక్కువగా షుగర్, బీపీ, యూరిక్ యాసిడ్, గుండెజబ్బు వ్యాధులకు గురవుతున్నారు. ఇక మనదేశంలో రోజుకురోజుకు మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. చిన్న పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు.. మధుమేహం బారిన పడుతున్నారు. అయితే షుగర్ ఉన్నవారి కోసం అనేక ఆహారపు చిట్కాలున్నాయి.

అందులో గ్రీన్ టీ మధుమేహం ఉన్నవారికి దివ్యౌషధం. గ్రీన్ టీ బ్లడ్ షుగర్‌ను కూడా నియంత్రిస్తుంది. రోజుకు 4-5 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఈ విషయం ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా, ప్రజలు బరువు తగ్గడానికి గ్రీన్ టీని తీసుకుంటారు. అయితే ఇది అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్రీన్ టీలో మన శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి. గ్రీన్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి గట్ హెల్త్ మెరుగుపడుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది.

మెడికల్ న్యూస్ టుడే కథనం ప్రకారం… రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు మధుమేహాన్ని నియంత్రించవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది మన శరీరంలో మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ సిండ్రోమ్ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది . గ్రీన్ టీ తాగడం వల్ల ఈ డయాబెటిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది . మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీలోని అనేక పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి . పేగు మంట నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీలో ఉండే అనేక సమ్మేళనాలు కార్డియోమెటబాలిక్ వ్యాధిని 15 సంవత్సరాల వరకు నివారిస్తాయి. ప్రతి ఒక్కరూ గ్రీన్ టీని రోజుకు 2-3 సార్లు త్రాగాలి. మెటబాలిక్ సిండ్రోమ్ లేదా మధుమేహంతో బాధపడేవారు రోజూ 4-5 కప్పుల గ్రీన్ టీ తాగాలి. ఈ అధ్యయనాన్ని 2022లో USలోని పెన్సిల్వేనియా ఒహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. శాస్త్రవేత్తల ప్రకారం, పాలీఫెనాల్ సమ్మేళనాలు గ్రీన్ టీలో కనిపిస్తాయి, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీరంలోని ఏ భాగమైనా వాపు దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని నివారించడానికి గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్ టీకి బదులు సప్లిమెంట్లు తీసుకునే వారు కూడా ఈ సులభమైన పద్ధతిని అనుసరించాలి.